Karthika Deepam : మోనిత నా భార్య అంటున్న కార్తీక్… కార్తీక్ కి గతం గుర్తు చేస్తున్న దీప…

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీజన్ ఈరోజు రిలీజ్ కాదు. ఎపిసోడ్ 1442 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మోనిత సౌందర్య వాళ్లు ఉన్న హోటల్ కి వస్తుంది. కానీ వాళ్లు ఒకరినొకరు చూసుకోరు. మోనిత కార్తీకి గతం గుర్తు రాకుండా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకొకపక్క సౌందర్య హిమకి నేను ఎలాగైనా శౌర్యను తీసుకువస్తాను అని మాట ఇస్తూ ఉంటుంది. అలా ఒకరికి కనపడకుండా ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే.. దీప కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటుంది. కార్తీక్ శివుని తీసుకొని బయటికి వస్తాడు. దీప ఉన్న చోటుకే కార్తీక్ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉండగా.. దీప కార్తీక్ ని చూసి తన దగ్గరికి డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని గట్టిగా పిలుచుకుంటూ..వస్తుండగా… శివ తనను తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు దీప అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ..అని ఆటోలో వాళ్లని ఫాలో అవుతుంది.

కార్తీక్ మోనిత ఇంట్లోకి వెళ్లి కారు దిగి వెళ్తుండగా.. దీప కూడా అక్కడికి వెళుతుంది. అప్పుడు దీప కార్తీక్ నీ డాక్టర్ బాబు అని అంటుండగా.. అసలు మీరు ఎవరండి అని డాక్టర్ కార్తీక్ అంటాడు. అంతలో మౌనిత అక్కడికి వచ్చి కార్తీక్ నువ్వు బయటికి వెళ్లొద్దు అంటే ఎందుకెళ్లావ్ అని అంటుండగా.. తనకి దీప కనిపిస్తుంది. అప్పుడు దీప మౌనిత ఒకరినొకరు చూసుకుంటారు. మోనిత భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు దీపా, మౌనితని నేను అనుకున్నానే నువ్వే డాక్టర్ బాబు ని తీసుకొచ్చావని ఇక డాక్టర్ బాబుకి నేనే భార్యని అని చెప్పే దానివి నువ్వు తప్ప ఎవరూ లేరు అని నేను అనుకున్నా.. నా కార్తీక్ బాబుని నీ దగ్గరే పెట్టుకుని మళ్లీ ఏమి ఎరగని దానిలాగా ఫోటో పట్టుకొని డ్రామాలాడుతున్నావా.. అని ఒక్కసారిగా వెళ్లి తనపై దాడి చేస్తూ ఉంటుంది.

Karthika Deepam Serial will Karthik says Monita is my wife

అప్పుడు కార్తీక్ ఆగండి మీరు అసలు ఎవరు నా భార్యని ఎందుకు చంపాలని చూస్తున్నారు అని అంటాడు. అప్పుడు ఆశ్చర్యంగా దీప చూస్తూ ఉంటుంది. ఇది నీ భార్య నా.. మరి నేనెవరు.. అని అంటుంది. అప్పుడు కార్తీక్ మీరు ఎవరో నాకు తెలియదండి. మీరు నన్ను చూసి ఎవరో అనుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు మౌనితకి మంచి ఛాన్స్ దొరికింది. అనుకుంటూ కార్తీక్ ని దీపపై ఉసిగొలుపుతుంది. ఈమె ఎవరో డబ్బులు కోసం ఇలా నిన్ను నా భర్త అని చెప్పుకుంటూ తిరుగుతుంది. తనని నమ్మకండి అని చెప్తుంది. అప్పుడు దీప ఇది పెద్ద మాయలాడి.. ఇది మనల్ని విడదీయాలని చూసింది. ఇది మోసగత్తే. దీనిని నమ్మి మీరు ఎలా ఇక్కడికి వచ్చారు. అసలు మీకు ఏమైంది నన్నెందుకు గుర్తుపడటం లేదు.. అలా మౌనిత గురించి కార్తీక్ ని చెప్తుంది.. అలా మౌనిక దీపాల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కార్తీక్ మాత్రం దీప ని అసలు గుర్తుపట్టడు. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో తెలుసుకోవాల్సిందే..

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

2 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

3 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

3 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

5 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

6 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

7 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

8 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

8 hours ago