Karthika Deepam Uma : ముదురు ప్రేమను చూడలేకపోతోన్న జనాలు.. కార్తీకదీపం భాగ్యంకు లోబో ముద్దులు!
Karthika Deepam Uma కార్తీకదీపం భాగ్యం బిగ్ బాస్ 5 తెలగు ఇంట్లో చేస్తోన్న రచ్చ సంగతి తెలిసిందే. బూతులతో దుమ్ములేపిన ఉమా దేవీ ఇప్పుడు రొమాన్స్‌తో రచ్చ చేస్తోంది. లోబోతో కలిసి ఉమా దేవీ చేస్తోన్న రొమాన్స్‌కు కంటెస్టెంట్లతో పాటు ఆడియెన్స్ కూడా నవ్వుకుంటున్నారు. ఈ ముదురు ప్రేమను చూసి అందరూ షాక్ అవుతున్నారు. భంగు అంటూ లోబోను ఉమాదేవీ పిలవడం, పొట్టి అంటూ ఉమాదేవీని లోబో ప్రేమగా సంబోధించడం చూసి ఇతర ఇంటి సభ్యులు తెగ నవ్వుకుంటున్నారు.
Karthika Deepam Uma And Lobo Fun In Bigg Boss 5 Telugu
బిగ్ బాస్ ఇంట్లో లోబో రొమాన్స్ Karthika Deepam Uma
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అయితే లోబో, ఉమాదేవీ రొమాన్స్ భరించలేకపోయారు. డైనింగ్ టేబుల్ వద్ద ఈ ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు, పెట్టుకున్న ముద్దులు, ఆ చేతులు పట్టుకోవడం, ఒకరినొకరు తినిపించుకోవడం, నువ్వే అందంగా కనిపిస్తున్నావ్ అంటూ లోబో అనడం.. వీరి రొమాన్స్‌ను అందరూ చూసి తెగ నవ్వుకున్నారు. అది యాక్టింగ్ లానే ఉందంటూ యాంకర్ రవి గాలి తీయడంతో అందరూ పగలబడి నవ్వేశారు.
Umadevi Fires On Anee Master In Bigg Boss 5 Telugu
బిగ్ బాస్ 5 తెలగు ఇంట్లో ఉన్న సింగిల్ బెడ్ కోసం అందరూ ఆశగా ఎదురుచూశారు. నిన్న ఆ బెడ్‌ను టాస్క్ చేసి అందరినీ మెప్పించడంతో లోబో సొంతం చేసుకున్నాడు. కానీ ఉమాదేవీ ఓడిపోయింది. దీంతో ఆ బెడ్‌ను ఉమా దేవీకి ఇచ్చేస్తాను అని లోబో అనేశాడు. కానీ ఉమా దేవీ మాత్రం తీసుకోలేదు. ఐ లవ్యూ చెబుతూ మోకాళ్ల మీద నిల్చున్ని ఆ బెడ్‌ను తీసుకోమ్మని అడిగాడు. కానీ ఉమాదేవీ మాత్రం తీసుకోలేదు. అలా ఈ ఇద్దరి ప్రేమను చూసి అందరూ షాక్ అవుతున్నారు.
