Karthika Deepam : మెల్ల మెల్లగా గతం గుర్తుతెచ్చుకుంటున్న కార్తీక్… నిజం తెలుసుకుంటున్న శివ…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 18, 2022, 9:34 am

Karthika Deepam : కార్తీక దీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 1461 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… దీప జరిగిందంతా పెద్దవిడకి, డాక్టర్ కి చెప్పి అక్కడ నుంచి మౌనిత దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఆనంద్ కోసం ఒకపక్క సౌందర్య వాళ్ళు, ఇంకొకపక్క మౌనిత వెళుతూ ఉంటారు. సౌందర్య వాళ్లు వెళ్లే లోపు మౌనిత వెళ్లి ఆనంద్ ని తీసుకొని వస్తుంది. సౌందర్య వాళ్లు వెళ్లి అడగగా మోనిత తీసుకెళ్లిందని వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్లు నిరాశతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇక కట్ చేస్తే దీప మౌనిత దగ్గరికి వెళుతూ ఉండగా.. ఇంట్లో కార్తీక్ పాటలు పాడుతూ ఒక్కడే ఉండడం చూసి దీప తన దగ్గరికి వెళ్తూ ఉండగా.. శివ తనని ఆపుతాడు. శివ తనంతట తానే మోనిత లేదు ఊరెళ్ళింది తను రేపటి వరకు రాదు అన్నా నిజాన్ని చెప్తాడు. శివ దీపని వెళ్లనివ్వకుండా ఆపుతాడు. అప్పుడు దీప నిన్నే ఏం చేయాలో నాకు తెలుసు అని తిరిగి వెళుతూ..

ఇప్పుడు నా డాక్టర్ బాబుని ఎలాగైనా నా ఇంటికి రప్పిస్తా తనకు గతం గుర్తొచ్చేలా చేస్తా అనుకుంటూ.. వెళ్లి బిర్యాని వండుతూ ఉంటుంది.ఆ వాసన కార్తీక్ ఇంటి వరకు వస్తుంది. కార్తిక్ ఆ వాసనని చూసి వంటలక్క బిర్యానీ వండుతుంది. మనం వెళ్దాం అని అంటాడు. అప్పుడు శివ మేడం ఊరుకోదు సార్ అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ మీ మేడం ఊర్లో లేదు కదా.. మనం అక్కడికి వెళ్లి తిన్న విషయం ఎలా తెలుస్తుంది వెళ్దాం పద అని శివని తీసుకొని వెళ్తాడు. అప్పుడు దీప సంతోష పడిపోతూ కార్తీక్ బిర్యాని వడ్డిస్తూ తన కుటుంబం గురించి అంత చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మెల్లమెల్లగా గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. దీప మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగింది. ఎలా జరిగింది.. ఎవరెవరు ఉన్నారు. అన్న విషయాన్ని కార్తీక్ కి చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ గుర్తు చేసుకుంటూ ఉండగా తల పట్టుకుని ఉండగా..

Karthika Deepam Will Karthik is slowly remembering the past

Karthika Deepam Will Karthik is slowly remembering the past

దీప డాక్టర్ బాబు తలకి మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ కొన్ని పేర్లను చెప్తూ ఉంటాడు. అప్పుడు దీప అవును అని సంతోష పడిపోతూ ఉంటుంది. ఇదంతా వింటున్న శివ ఆశ్చర్యపోతూ ఉంటాడు. నిజం తెలుసుకున్న శివ మౌనిత మాయలాడి అని కూడా తెలుసుకుంటాడు. కట్ చేస్తే సౌర్య వాళ్ళ బాబాయిని మా అమ్మ ఎక్కడ ఎక్కింది. ఎక్కడ దిగింది. మళ్లీ మనం అక్కడికే వెళ్లి వెతుకుదాం పద బాబాయ్ అని అడుగుతూ ఉండగా.. శౌర్య,బాబాయ్ ఆవిడ మీ అమ్మ అయి ఉండదమ్మా.. ఒకవేళ మీ అమ్మే అయితే తను మిమ్మల్ని వెతకకుండా.. తన భర్త కోసం ఒక మందు కావాలి అని ఎందుకు వెళ్తుంది. అని అంటుండగా.. అప్పుడు శౌర్య మా నాన్నకి ఒకవేళ యాక్సిడెంట్ లో ఏదైనా అయి ఉంటే దానికోసం మందు తీసుకోవడానికి వెళుతుందేమో బాబాయ్ మనం వెళ్దాం ప్లీజ్ అని అడుగుతూ ఉండగా.. సరే అమ్మ వెళ్దాం పద అని వెళ్తూ ఉంటారు. అప్పుడు శౌర్య సంతోషంగా, ఆసక్తికరంగా దీప కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp