Keerthi Suresh and Pooja Hegde are finally getting into similar roles
Keerthi Suresh : తాజాగా వచ్చిన సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకుంది కీర్తి సురేశ్. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించాయి. రిలీజ్ రోజునుంచి డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ వసూళ్ళు మాత్రం భారీగా ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా మొత్తంగా హిట్ సాధించిందని చెప్పొచ్చు. ఇక మహానటి సినిమా తర్వాత మళ్ళీ ఇంతకాలానికి కీర్తి మంచి కమర్షియల్ హిట్ అందుకుంది.మొదటిసారి కీర్తి గ్లామర్ గేట్లు ఎత్తేసి తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. సర్కారు వారి పాట సినిమాలో తన పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పుకుంటున్నారు.
ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమాతో కీర్తికి మంచి ప్రశంసలే దక్కాయి. ఇక పాన్ ఇండియన్ సినిమాలలో నటిస్తున్న పూజా హెగ్డేకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆమె నటించిన రాధే శ్యామ్మ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి. కెరీర్ ప్రారంభంలో అమ్మడికి ఎలాంటి నెగిటివ్ టాక్ వచ్చిందో..ఇప్పుడు మళ్ళీ వరుస ఫ్లాప్స్ వల్ల అలాంటి నెగిటివ్ టాకే వస్తోంది.అయినా పూజాకు అవకాశాల విషయంలో ఏమీ కొదవలేదు. తెలుగులో మూడు సినిమాలు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. అటు కీర్తి చేతిలోనూ వరుసగా సినిమాలున్నాయి. అయినా ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్దరూ సీనియర్ స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రల్లో నటించేందుకు ఒప్పుకోవడం కాస్త ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికే కీర్తి సురేశ్ అటు తమిళ స్టార్ రజనీకాంత్‌కు చెల్లిగా అణ్ణాత్త సినిమాలో నటించింది.
Keerthi Suresh and Pooja Hegde are finally getting into similar roles
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే కూడా టాలీవుడ్ సీనియర్ విక్టరీ వెంకటేశ్‌కు చెల్లిగా నటించేందుకు ఒప్పుకున్నట్టు తాజా సమాచారం. వెంకీ – బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. ఇందులో వెంకటేశ్‌కు సోదరిగా నటించడానికి ఒప్పుకుందని అంటున్నారు. దీనిపై త్వరలో కన్‌ఫర్మేషన్ కూడా రానుందని తెలుస్తోంది. అయితే, కీర్తి..పూజా ఇలా సీనియర్ హీరోలకు సిస్టర్ పాత్రల్లో నటించడానికి కారణం కథ నచ్చడంతో పాటు ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావనే ఉద్దేశ్యం. అందుకే, ఈ అవకాశాలను వదులుకోవడం లేదు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.