
will janaki go to jail for having conflict with kannababu in janaki kalaganaledu
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 16 మే 2022, సోమవారం ఎపిసోడ్ 301 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మదర్స్ డే వేడుకలు పూర్తయ్యాక.. నీలావతి వచ్చి వేడుకల్లో కారం చల్లుతుంది. కన్నబాబు, రామా మధ్య గొడవ జరిగిందని.. కన్నబాబు చొక్కాను రామా పట్టుకున్నాడని చెబుతుంది నీలావతి. దీంతో ఏం జరిగిందని రామాను జ్ఞానాంబ అడుగుతుంది. దీంతో రామాకు ఏం చెప్పాలో అర్థం కాదు. చివరకు ఎలాగోలా అబద్ధం ఆడుతాడు. పాత గొడవలను దృష్టిలో పెట్టుకొని కన్నబాబు కొట్టు దగ్గరికి గొడవకు వచ్చాడని చెప్పి మేనేజ్ చేస్తాడు రామా. కానీ.. జ్ఞానాంబకు మాత్రం ఏం అర్థం కాదు. రామా ఏదో దాస్తున్నాడని జ్ఞానాంబ అనుకుంటుంది.
will janaki go to jail for having conflict with kannababu in janaki kalaganaledu
మరోవైపు మల్లికకు అసలు గొడవ ఎందుకు జరిగిందో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఇంటికి వెళ్తుంటుంది. ఇంతలో నీలావతి వచ్చి నాకు ఇస్తా అన్న డబ్బులు ఇవ్వు అంటుంది. ఇంకెక్కడి డబ్బులు.. అసలు వాళ్లిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగిందో తెలసుకో అంటే అది మాత్రం తెలుసుకోలేకపోయావు.. డబ్బులు కావాలా అని అంటుంది. దీంతో నాకు ఖచ్చితంగా తెలుసు.. ఆ గొడవ కొట్టు గురించే అంటుంది. దీంతో పదా.. కన్నబాబు దగ్గరికే వెళ్లి అసలు విషయం తెలుసుకుందాం అంటుంది మల్లిక. దీంతో ఇద్దరూ కన్నబాబు ఉన్న ప్లేస్ కు వెళ్తారు కానీ.. కన్నబాబును చూసి మల్లిక భయపడి వెనక్కి వచ్చేస్తుంది.
మరోవైపు రామా భోజనం చేయకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. చివరకు అన్నం తినకుండానే చేతులు కడిగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా. నేను మోసపోయాను.. స్వీటు కొట్టు విషయంలో నా మీద నీకు ఉన్న నమ్మకాన్ని నేను వమ్ము చేశానమ్మా అని చెప్పి అన్నం తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా.
రామా తినకుండా వెళ్లిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తను కూడా అన్నం తినకుండా వెళ్లిపోతుంది జ్ఞానాంబ. బయటకు వెళ్లిన రామా.. ఆరుబయట కట్టెలు కొడుతూ ఉంటాడు. రామా కట్టెలు కొట్టడం చూసి షాక్ అవుతుంది జ్ఞానాంబ. ఏదైనా కోపంలో కానీ.. బాధలో కానీ ఉన్నప్పుడు రామాకు కూడా నాలా ఏదో ఒక పని చేసే అలవాటు ఉంది అని అనుకుంటుంది జ్ఞానాంబ.
రామా మనసులో ఏదో సముద్రమంత బాధ అయితే ఉందని అర్థం అవుతోంది అని అనుకుంటుంది జ్ఞానాంబ. వీటన్నింటికి కారణం ఆ జానకినే అనుకొని జానకి దగ్గరికి వెళ్తుంది జ్ఞానాంబ. తనపై మండిపడుతుంది. భర్త ఏం చేస్తున్నాడు.. ఎందుకు బాధపడుతున్నాడో ఎప్పుడైనా ఆలోచించావా అని ప్రశ్నిస్తుంది.
నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లనే నా కొడుకుకు ఈ గతి పట్టింది అని చెప్పి తనపై సీరియస్ అయి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. ఇంతలో రామా వస్తాడు. రామాను ఏమైంది అని ఆరా తీస్తుంది జానకి. కానీ.. రామా కూడా జానకి మీద చిరాకు పడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మరోవైపు మల్లిక.. జానకి జైలుకు వెళ్లబోతోందని జ్ఞానాంబతో చెబుతుంది. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఎందుకు జానకి జైలుకు వెళ్తుంది అని అడుగుతుంది జ్ఞానాంబ. జానకి మాట్లాడు అంటుంది. కానీ.. జానకి ఏం మాట్లాడదు. ఆ కన్నబాబుతో ఎందుకు గొడవ పడ్డావని అడుగుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.