
keerthi suresh everyone mistaken by this
Keerthi suresh : కీర్తి సురేష్ యంగ్ హీరో నితిన్ నటించిన రంగ్ దే సినిమాలో హీరోయిన్ గా నటించింది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ మధ్య కీర్తి సురేష్ కి వరసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు కీర్తి సురేష్ నుంచి వచ్చాయి. కాని అభిమానులను.. ప్రేక్షకులను విపరీతంగా నిరాశపరచాయి. అదే సమయంలో తన ఫిజిక్ లో కూడా మార్పులు వచ్చి అభిమానుల నుంచే నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చి ఫీలయ్యేలా చేశాయి. అందుకే మళ్ళీ బొద్దుగా మారేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
అంతేకాదు వరసగా రెండు ఫ్లాప్స్ తర్వాత వస్తున్న రంగ్ దే సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని తెగ తాపత్రయపడుతోంది. ఇప్పటికే రంగ్ దే సినిమా పోస్టర్.. రిలీజైన లిరికల్ సాంగ్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన రంగ్ దే మీద నితిన్ తో పాటు కూడా కీర్తి సురేష్ .. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. కాగా ప్రస్తుతం రంగ్ దే సినిమా రీ రికార్డింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి తో కలిసి కీర్తి సురేష్ దేవీశ్రీప్రసాద్ రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళింది. వీరితో పాటు సీనియర్ సినిమాటోగ్రాఫర్ పీసీశ్రీరాం కూడా జాయిన్ అయ్యారు.
keerthi suresh everyone mistaken by this
ఈ సందర్భంగా అందరు కలిసి రికార్డింగ్ స్టూడియోలో ఫొటోస్ దిగి అభిమానులతో పంచుకున్నారు. అయితే కీర్తి సురేష్ రంగ్ దే సినిమాలో పాట పాడటానికే దేవీశ్రీప్రసాద్ స్టూడియోకి వచ్చిందని పొరపాటు పడ్డారు. అందరూ కీర్తి ని అదే విషయం అడిగారట. అందుకు కారణం ఇంతకు ముందు విక్రం నటించిన స్వామీ 2 లో విక్రం తో కలిసి పాట పాడింది. అందుకే ఇప్పుడు మళ్ళీ రంగ్ దే కోసం పాడిందని అనుకున్నారు. కాని అది కేవలం ఫ్రెండ్లీ మీటింగ్ అని క్లారిటీ ఇచ్చేసింది. ఇది కాస్త కీర్తి సురేష్ ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ అయ్యే విషయమే. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట లో హీరోయిన్ గా నటిస్తోంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.