Home » Entertainment » Keerthi Suresh Is Also Committing For Glamour Roles
Entertainment

Keerthi Suresh : కొద్ది కొద్దిగా కీర్తి సురేశ్ కూడా గ్లామర్ రోల్స్‌కు ఒప్పేసుకుంటుందిగా..

Authored By
vamana sai
The Telugu News | Published on: April 26, 2022, 11:00 am
Advertisement

Keerthi Suresh : గత రెండేళ్ళ నుంచి వరుస ఫ్లాప్స్ ఉన్నా కూడా చేతినిండా సినిమాలున్న హీరోయిన్ అంటే ఒక్క కీర్తి సురేశ్ ఒక్కరే అని చెప్పాలి. మహానటి తర్వాత ఈ బ్యూటీ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడింది లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటూ అనవసరమైన ప్రయోగాలు చేసి వరుస ఫ్లాప్స్ అందుకుంది. ఇక కీర్తి కెరీర్ అయిపోయిందనుకుంటున్న ప్రతీసారీ అమ్మడు ఏదో ఒక భాషలలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ అయినా కూడా సిస్టర్ రోల్స్ చేయడం మరో ఇంట్రెస్ట్ విషయం.కనీసం అలా కూడా కీర్తికి హిట్ పడటం లేదు. ఇప్పుడు కీర్తి మీద బాగా నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతోంది.

Advertisement

ఆమె నటించిన సినిమా ఫ్లాప్ అంటూ హీరోల అభిమానులు కొందరు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు మహేశ్ అభిమానుల గోల కూడా అదే. మే 12న మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన సర్కారు వారి పాట రిలీజ్ కాబోతోంది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాను బ్యాకింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో స్టైలిష్ యాక్షన్ అండ్ రొమాంటిక్ సినిమాగా రూపొందుతోంది.ఇందులో కీర్తి కాస్త గ్లామర్‌గా కనిపించబోతుందని కొద్ది కొద్దిగా అందాల ఆరబోత చేయబోతుందని ఇటీవల వచ్చిన కళావతి పాట చూస్తే అర్థమవుతోంది.

keerthi-suresh-is-also-committing-for-glamour-roles

Advertisement

Keerthi Suresh : మెల్ల మెల్లగా రూట్ మార్చాలని డిసైడయినట్టుంది.

ఇదిలా ఉంటే.. మే 6వ తేదీన కీర్తి సురేశ్, దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన సాని కాయిదం సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి కంప్లీట్ డీ గ్లామర్ పాత్రలో నటించింది. అంతేకాదు, పాటల్లో మాత్రం కాస్త గ్లామర్‌ను ఒలక బోసినట్టు పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది. ఇంతకాలం కీర్తి పూర్తిగా డీసెంట్ రోల్స్ చేస్తూ బండి లాక్కొస్తోంది. కానీ, దానివల్ల కీర్తి చేరుకోవాల్సిన ప్లేస్‌కు చేరుకోవడం లేదు. అందుకే, మెల్ల మెల్లగా రూట్ మార్చాలని డిసైడయినట్టుంది. అందుకే, ఇలా గ్లామర్‌గా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి