Raveena Tandon : రవీనా టాండన్..బాలీవుడ్‌లో 1990లలో ఒక ఊపు ఊపేసిన గ్లామర్ హీరోయిన్. రవీనా టాండన్..హిందీలో మాత్రమే కాకుండా తెలుగు లో కూడా గ్లామర్ రోల్స్ చేసి హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే, తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదు. హిందీలో మాత్రం కొన్నేళ్ళ పాటు ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ రవీనా టాండన్ అంటే హిందీలో గుర్తొచ్చే సినిమాలు మొహ్ర, దిల్‌వాలే, బడే మియా ఛోటే మియా, అందాజ్ అప్నా అప్నా, జిద్దీ వంటి చిత్రాలే. రవీనా టాండన్ పాటలలో ఎక్కువగా ఇప్పటికీ జనాలు చూసేది మొహ్ర సినిమాలోని తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్.
ఇక ఈ బ్యూటీ కన్నడ స్టార్ ఉపేంద్ర సరసన ఉపేంద్ర సినిమా చేసి హిట్ అందుకుం ది. ఇక తెలుగులో ‘బంగారు బుల్లోడు, రథసారథి, ఆకాశవీధిలో’ వంటి సినిమాల లో హీరోయిన్‌గా నటించింది. మళ్ళీ ఇంత కాలానికి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చసే అవకాశాలు అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. రవీనా టాండన్ కి కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాతో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందులో ఆమె పోషించిన రమికా సేన్ పాత్రకు బాగా పేరొచ్చింది. ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలు తెలుగు చిత్రాలలో కూడా ఉంటున్నాయి. కానీ, వాటికి తగ్గ సీనియర్ క్రేజీ హీరోయిన్ ఇన్నాళ్ళు మన మేకర్స్‌కు తారసపడలేదు.
ఇప్పుడు రవీనా టాండన్ అలాంటి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందు తున్న భవదీయుడు భగత్‌సింగ్ సినిమాలో రవీనా టాండన్ కి కీలక పాత్ర ఇస్తున్నట్టు సమాచారం. పవన్ సినిమా అంటే ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో అందులో నటించే వారికి ఎలాంటి పాపులారిటీ దక్కుతుందో అందరికీ తెలిసిందే. ఇక దర్శకుడు హరీశ్ శంకర్ కూడా తన సినిమాలలో పాత్రలను ఎంతో అద్భుతంగా డిజైన్ చేస్తాడు. కాబట్టి ఇందులో రవీనా టాండన్ నటించేది నిజమైతే గ్యారెంటీగా మంచి పాపులారిటీ దక్కుతుంది. అయితే, గురూజీ మాటల మాంత్రీకుడు త్రివిక్రం కూడా రవీనా టాండన్ కోసం అద్భుతమైన పాత్ర రాసినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రం ఓ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. దీనిలో రవీనా టాండన్ ను తీసుకుంటున్నారట. అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్రకు, అజ్ఞాతవాసి
సినిమాలో ఖుష్బూ పాత్రలకు మించి క్రేజ్ రవీనా టాండన్ కి వస్తుందని టాక్ వినిపిస్తోంది. చూడాలి వీటికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.