Home » Entertainment » Keerthi Suresh With Them Pic Going Viral
Entertainment

Keerthi Suresh: ఆ ఇద్దరితో కీర్తి సురేశ్ నెట్టింట పిక్ వైరల్..

Authored By
vamana sai
The Telugu News | Published on: May 2, 2022, 10:05 am
Advertisement

Keerthi Suresh: ఫ్లాపులతో నాకేంటి పని అనే విధంగా కీర్తి సురేశ్ వరుస సినిమాలతో చెలరేగిపోతుంది. మహానటి తర్వాత కీర్తి ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ చేరలేదు. అయినా అవకాశాలు మాత్రం వరుసబెట్టి వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ ఎవరైనా అంత త్వరగా సీనియర్ స్టార్స్ పక్కన చెల్లి పాత్రల్లో నటించడానికి ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలంటే నిర్మొహమాటంగా నో చెప్పేస్తారు. ఒకసారి ఓ సీనియర్ హీరోకు చెల్లిగా నటిస్తే ఆ తర్వాత అన్నీ అలాంటి అవకాశాలే వస్తాయనే భావన ఉంటుంది. అందుకే మన సౌత్‌లో ఇలాంటి పాత్రలను పక్కన పెట్టేస్తున్నారు. కానీ, బాలీవుడ్‌లో ఇలాంటి పాత్రలు చేయడానికి దాదాపు అందరూ స్టార్ హీరోయిన్స్ రెడీగా ఉంటారు.

Advertisement

అయితే, కీర్తి ఈ విషయంలో కూడా ఇక్కడ రూల్స్ బ్రేక్ చేసిందని చెప్పాలి. మొన్నా ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన అణ్ణాత్త సినిమాలో చెల్లిగా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. అయినా మళ్ళీ చిరంజీవికి చెల్లిగా భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. హీరోయిన్‌గా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాట, నాని సరసన దసరా సినిమాలు చేస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన ఒక సినిమాను చేస్తోంది. మాతృ భాషలో ఓ సినిమాను అది కూడా సొంత నిర్మాణ సంస్థలో చేస్తుంది.ఇక ఇప్పటికే దర్శకుడు సెల్వ రాఘవన్‌తో కలిసి ఓ క్రైమ్ డ్రామా సినిమాలో కంప్లీట్ డీ గ్లామర్ రోల్‌లో నటించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు.

keerthi-suresh with them pic going viral

Advertisement

Keerthi Suresh: దర్శకుడు పరశురామ్, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్‌లతో కలిసి ..

అయితే, కీర్తి ఏ సినిమా చేసినా ఆ చిత్ర బృందంతో కలిసి తెగ సందడి చేస్తుంటుంది. విదేశాలలో షూటింగ్స్‌కు వెళ్ళినప్పుడు దర్శకులను, హీరోలను, సంగీత దర్శకుల ను ఆట పట్టించడం లాంటివి బాగానే చేస్తుంది. సినిమాలలో కనిపించినంత డీసెంట్ ఏమీ కాదు కీర్తి. బయట మహా అల్లరి అంటుంటారు. ఇక సినిమా మేకింగ్ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తుంది. తాజాగా కూడా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసింది కీర్తి. ఈ సమయంలో దర్శకుడు పరశురామ్, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్‌లతో కలిసి ఉన్నారు. ఆ పిక్‌ను తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేయగా ఇప్పుడది నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి