Karthika Deepam 2 May Today Episode : ఆనంద్ గురించి తెలుసుకున్న హిమ, జ్వాల.. సౌందర్యకు ఆనంద్, శౌర్య గురించి అసలు నిజం తెలుస్తుందా?

Karthika Deepam 2 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 మే 2022, సోమవారం ఎపిసోడ్ 1341 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రవ్వ ఇడ్లీకి దెబ్బలు తాకాయని దుర్గన్న.. జ్వాలకు ఫోన్ చేయడంతో వెంటనే జ్వాల, హిమ ఇద్దరూ రవ్వ ఇడ్లీ ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చి తనకు తాకిన దెబ్బలను చూసి షాక్ అవుతారు. అసలు నువ్వు స్కూల్ లో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు అంటుంది జ్వాల. నిన్ను చదివించేది ఎందుకు డాక్టర్ అవ్వాలనే కదా అంటుంది జ్వాల. దీంతో అవును డాక్టర్ అవ్వాలని నాకు కూడా ఉంది కానీ వాళ్లు నన్ను చదువుకోనిస్తే కదా. మా అమ్మానాన్నలు ఎవరో ఏంటో.. వాళ్ల పేర్లు ఏంటో నాకు కూడా తెలియదు. అన్నీ అడుగుతారు.. నాకు తెలియదు అంటే నవ్వుతారు అంటాడు రవ్వ ఇడ్లీ.

karthika deepam 2 may 2022 full episode

అందుకే కొట్టాను. చెప్పు జ్వాల.. చెప్పు డాక్టరమ్మ. మిమ్మల్ని అడిగితే మీకు కోపం రాదా అంటాడు. అవునులే.. మీకు ఈ బాధ ఎలా తెలుస్తుంది. మీకు అందరూ ఉన్నారు కదా. కానీ.. నాకే ఎవ్వరూ లేరు. నన్ను కన్నవాళ్లు గొప్పవాళ్లంట. కానీ.. వాళ్ల వివరాలు తెలియదు అంటాడు రవ్వ ఇడ్లీ. పేర్లు తెలియదు. అదిగో ఆ ఫోటోలు మాత్రం ఉన్నాయి. వాళ్లే మా అమ్మానాన్నలు అంట. ఎందుకు చూసుకొని ఏడవడానికే కదా అంటాడు. ఇంతలో జ్వాల, హిమ ఇద్దరూ వెనుకకు తిరిగి వాళ్ల ఫోటోలను చూసి షాక్ అవుతారు.

కార్తీక్, మోనిత ఫోటో ఉండటం చూసి షాక్ అవుతారు. తమ చిన్నప్పుడు ఆనంద్ తో ఆడుకున్న విషయాలు వాళ్లకు గుర్తొస్తాయి. చూశారా.. వీళ్లే మా అమ్మానాన్నలు అంటాడు రవ్వ ఇడ్లీ. గొప్పోళ్లట.. ధనవంతులట. ఇద్దరూ డాక్టర్లేనట అంటాడు రవ్వ ఇడ్లీ.

ఇంతలో జ్వాల.. మళ్లీ మోనిత గురించి గుర్తు తెచ్చుకుంటుంది. మరి నేనెందుకు ఇలా ఉన్నానో ఎవ్వరికీ తెలియదంట అంటాడు రవ్వ ఇడ్లీ. అంటే.. వీడు నా తమ్ముడా అని అనుకుంటుంది హిమ. ఇన్నాళ్లకు నన్ను నా తమ్ముడిని కలిపావా అని  మనసులో అనుకుంటుంది హిమ.

శౌర్య ఏం మాట్లాడుతుందో.. అసలు తన మనసులో ఏముంది. ఆనంద్ గురించి ఏం ఆలోచిస్తోంది.. అని అనుకుంటుంది హిమ. నేనే హిమను అని.. మీ అక్కను అని గట్టిగా హత్తుకొని చెప్పాలని ఉందిరా కానీ.. శౌర్యకు నేనెవరో తెలుస్తుందని ఆగుతున్నాను అని అనుకుంటుంది.

తర్వాత జ్వాల అక్కడి నుంచి బయటికి వస్తుంది. అలాగే నడుచుకుంటూ వెళ్తుంది. రవ్వ ఇడ్లీనే ఆనందా.. వాడే ఆనంద్ అవడం ఏంటి అని అనుకుంటుంది జ్వాల. ఆ రవ్వ ఇడ్లీ.. మోనిత ఆంటి కొడుకు అవ్వడం ఏంటి అని అనుకుంటుంది జ్వాల. ఇన్నాళ్లు నేను చేరదీసింది అమ్మానాన్నలను ఇబ్బంది పెట్టిన ఆ మోనిత కొడుకునా అని అనుకుంటుంది జ్వాల.

Karthika Deepam 2 May Today Episode : ఇంటికెళ్లి రవ్వ ఇడ్లీ గురించే ఆలోచించిన హిమ

విచిత్రంగా వీడికి డాక్టర్ అవ్వాలనే కోరిక రావడం ఏంటి అని అనుకుంటుంది హిమ. శౌర్య.. ఆనంద్ ను చూసి సంతోషపడలేదా.. ఎందుకు అలా వెళ్లిపోయింది. మోనిత ఆంటి అంటే శౌర్యకు కోపం. ఆ కోపమే తమ్ముడి మీద కూడా చూపిస్తోందా అని అనుకుంటుంది హిమ.

అంటే.. తమ్ముడెవరో తెలియకనే శౌర్య వాడిని చేరదీసి చదివిస్తోందా? అసలు తెలిసి చచేసిందా.. తెలియక చేసిందా. తమ్ముడి పరిస్థితి ఏంటి ఇప్పుడు అని అనుకుంటుంది. మరోవైపు స్వప్నకు ఫోన్ చేస్తుంది కీర్తి. సారీ స్వప్న అంటుంది కీర్తి. మా మమ్మీకి నువ్వు భయపడటం ఏంటి అంటుంది.

నీకు అసలు బుద్ధి ఉందా? తను రాఖీ కట్టించమంటే కట్టించడం ఏంటి.. అంటుంది. మా ఆయన బిజినెస్ చేస్తుంటాడని తెలుసు కానీ.. ఇంకేం చేస్తారో కూడా తెలియదు. మా ఆయన బిజినెస్ లో ఫ్రాడ్ చేస్తున్నారట. ఆ విషయం మీ మమ్మీ చెప్పింది. సాక్ష్యాలతో సహా చూపించడంతో నేను ఏం చేయలేకపోయాను అంటుంది కీర్తి.

ఒకరకంగా మీ మమ్మీ నాకు హెల్ప్ చేసింది అని చెప్పడంతో కోపంతో స్వప్న ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు దుర్గన్న టిఫిన్ సెంటర్ ను ఒక్కడే చూసుకుంటూ ఉంటాడు. మరోవైపు రవ్వ ఇడ్లీ.. నిజంగా నాకు ఎవ్వరూ లేరా అని అనుకుంటాడు. ఇంతలో హిమ వస్తుంది.

నన్నెవరూ పట్టించుకోరా అని అనుకుంటాడు. ఒరేయ్ ఆనంద్.. నేనురా మీ అక్కను అని చెప్పే అదృష్టం కూడా నాకు లేదా. ఇప్పుడు చెబితే శౌర్యకు తెలిసిపోతుంది. శౌర్యకు తెలిస్తే చాలా సమస్యలు వస్తాయి. శౌర్య నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని అనుకుంటుంది.

ఒరేయ్.. నన్ను ఇక నుంచి డాక్టరమ్మ అని పిలవకు. అక్క అని పిలువు అంటుంది. దీంతో అక్క అని పిలవాలా అని అంటాడు. చాలా సంతోషిస్తాడు. అక్క అని పిలుస్తాడు. ఇంతలో రవ్వ ఇడ్లీ తన కోసం కాఫీ తీసుకొస్తాడు. కూర్చో అక్క అంటాడు.

కాఫీ తాగు అక్క అంటాడు రవ్వ ఇడ్లీ. అక్క.. నాకు ఒక డౌటు అంటాడు. అక్క అని పిలిస్తే జ్వాలకు నచ్చదు. ఎలా మరి కోప్పడుతుందేమో అంటాడు. దీంతో జ్వాల ఉన్నప్పుడు డాక్టరమ్మ అని పిలువు.. జ్వాల లేనప్పుడు అక్క అని పిలువు అని అంటుంది హిమ.

అవును.. ఇంతకుముందు ఎప్పుడూ జ్వాల మీ రూమ్ కు రాలేదా అని అడుగుతుంది. దీంతో లేదు అక్కా.. మీరిద్దరూ కలిసి వచ్చినప్పుడే తను తొలిసారి వచ్చింది అంటాడు. కట్ చేస్తే సౌందర్య కనిపిస్తుంది జ్వాలకు. ఏంటి సీనియర్ సిటిజన్ ఇక్కడ ఉన్నారు ఏంటి అని అడుగుతుంది.

దీంతో సూపర్ మార్కెట్ లో సరుకులు తీసుకొని వెళ్తున్నాను అంటుంది. ఈరోజు నిన్ను వెంటాడటం ఖాయం అని మనసులో అనుకుంటుంది. నువ్వెంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు అంటుంది సౌందర్య. దీంతో సీనియర్ సిటిజన్.. నువ్వే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు అంటుంది.

నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది కానీ.. వెంటనే కోపం తగ్గిపోతుంది అంటుంది. ఇంతలో సరుకులు ఆటోలో నుంచి దించుతూ ఉంటుంది జ్వాల. నేను అందరి లాంటి దాన్ని కాదు.. మంచి చెడు రెండూ ముఖం మీదనే చెప్పేస్తా అంటుంది సౌందర్య. దీంతో తెలుసులే అంటుంది జ్వాల.

తెలుసా.. నీకు ఎలా తెలుసు అంటుంది సౌందర్య. చూస్తున్నాను కదా సీనియర్ అంటుంది. అంతా బాగానే ఉంది కానీ.. నీ పొగరు మాత్రం నాకు నచ్చడం లేదు అంటుంది. దీంతో నీ దగ్గరి నుంచే వచ్చిందిలే అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago