Keerthy Suresh clarity ON love Affair
Keerthy Suresh : కీర్తి సురేష్ కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు.. ప్రేక్షకులు ఈ విషయాన్ని తెగ చర్చించుకుంటున్నారు. ఇంతక ముందు కూడా ఇలాంటి న్యూస్ వచ్చి వైరల్ అయింది. స్వయంగా కీర్తి సురేష్ ఈ విషయంలో స్పందించి క్లారిటీ ఇస్తే గాని అందరికి మైండ్ లో ఉన్న అనుమానలన్నీ బ్లాస్ట్ అయ్యాయి. అయితే అప్పుడు వచ్చిన ఆ వార్తలు కీర్తి సురేష్ పెళ్ళికి సంబంధించి. కీర్తి సురేష్ కి పెళ్ళైందని కొందరు.. కీర్తి సురేష్ కి పెళ్ళి ఫిక్సైందని కొందరు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉందని తెలిపింది.
అంతేకాదు అనవసరమైన ప్రచారాలు చేయకండి అంటూ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసింది. దాంతో సినిమాలలో బిజీగా ఉన్న కీర్తి గురించి రూమర్స్ రావడం తగ్గిపోయింది. పూర్తిగా తన సినిమాలకి సంబంధించే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుండగా మహేష్ బాబు – కీర్తి సురేష్ ల మీద సీన్స్ తో పాటు సాంగ్ ని కంప్లీట్ చేస్తున్నారు. ఇక రజనీకాంత్ తో అన్నాత్తే సినిమా చేస్తోంది. ఇక ఇప్పటికే యంగ్ హీరో నితిన్ తో చేసిన రంగ్ దే సినిమా మార్చ్ 26 న రిలీజ్ కి రెడీ అవుతోంది.
Keerthy Suresh clarity ON love Affair
అయితే ఈ మధ్య కోలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తో కీర్తి సురేష్ ప్రేమలో ఉందని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు జత చేసి వార్తలు రాసేస్తున్నారు. ఇది కీర్తి సురేష్ ఫ్యామిలీ వరకు వెళ్ళింది. దాంతో స్వయంగా కీర్తి సురేష్ తల్లి మేనక స్పందించింది. ఇప్పటి వరకు కీర్తి సురేష్ పెళ్ళికి సంబంధించి వస్తున్న రూమర్స్ కి వాళ్ళ నాన్న .. అవన్ని పుకార్లని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నేను చెబుతున్నాను.. మా అమ్మాయి ఎవరితోనూ ప్రేమలో లేదు అంటూ స్వయంగా తెలిపింది. ఇప్పటి నుంచి ఇలాంటి న్యూస్ రాయకుండా ఉంటే మంచిదని అభిప్రాయపడింది. చూడాలి మరి ఇప్పుడైనా కీర్తి సురేష్ మీద వస్తున్న రూమర్స్ ఆగుతాయో లేదో.
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.