
keerthy suresh dance for kalaavahi song
Keerthy Suresh : మహానటి చిత్రంతో విమర్శల ప్రశంసలు అందకున్న కీర్తి సురేష్ డిఫరెంట్ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోల సరసన జతకట్టిన కీర్తి సురేష్ సోలో హీరోయిన్‌గా అదరగొడుతుంది.పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి ఇలా ప్రతీ సినిమా మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది. కీర్తి సురేష్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్‌గా ఏ సినిమా కూడా వర్కవుట్ అవ్వలేదు. అలా మొత్తానికి కీర్తి సురేష్ బ్యాడ్ లక్ సఖిగా మారిపోయింది. కీర్తి సురేష్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతోంది. సర్కారు వారి పాట సినిమా పట్ల మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కీర్తి సురేష్‌కు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించిన కీర్తి సురేష్ తాజాగా కళావతి పాటకు అద్దిరిపోయే స్టెప్పులు వేసింది. కళావతి పాటకు అచ్చు గుద్దినట్లుగా స్టెప్పేసి ఈ ఛాలెంజ్‌ని మహేష్ బాబు గారలపట్టి సితార మొదలు పెట్టడంతో తెగ డిమాండ్ సంతరించుకుంది. దీనిపై ఇప్పటికే శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ స్టెప్పేయగా.. తాజాగా ఈ పాటలో మహేష్ బాబుతో కలిసి నటించిన కీర్తి సురేష్ స్వయంగా స్టెప్పేసి ఫిదా చేసింది. ఈ వీడియోను కీర్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
keerthy suresh dance for kalaavahi song
‘స్టెప్ అదరహో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో భారీ హంగులతో ఈ ‘సర్కారువారి పాట’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగమయ్యారు. . మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు కడుతున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం మే 12వ తేదీన విడుదల కానుంది.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.