Keerthy Suresh : లిప్స్‌కి స‌ర్జ‌రీ చేయించుకున్న కీర్తి సురేష్‌.. నిజ‌మెంత‌? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Keerthy Suresh : లిప్స్‌కి స‌ర్జ‌రీ చేయించుకున్న కీర్తి సురేష్‌.. నిజ‌మెంత‌?

Keerthy Suresh : మ‌హాన‌టి కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నేను శైల‌జ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన కీర్తి సురేష్‌.. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకుంది. మహానటి సినిమా ఆమెకు పేరు ప్రఖ్యాతలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది.మహానటి సినిమా సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ తో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించడానికి క్యూ కట్టారు. ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ఈ ముద్దుగుమ్మ త‌గ్గేదేలే అన్న‌ట్టు సినిమాలు చేస్తుంది. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :18 May 2022,9:30 pm

Keerthy Suresh : మ‌హాన‌టి కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నేను శైల‌జ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన కీర్తి సురేష్‌.. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకుంది. మహానటి సినిమా ఆమెకు పేరు ప్రఖ్యాతలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది.మహానటి సినిమా సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ తో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించడానికి క్యూ కట్టారు. ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ఈ ముద్దుగుమ్మ త‌గ్గేదేలే అన్న‌ట్టు సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, కొంతమంది సినిమా అద్భుతంగా ఉంది అంటే, మరికొంతమంది సినిమా ఏమీ బాలేదని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆ సంగతలా ఉంచితే ఈ సినిమా చూసిన అభిమానులు అందరూ ఆమె లిప్ సర్జరీ చేయించుకున్నది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె సినిమాలో గతం కంటే కాస్త భిన్నంగా కనిపించిందని అందుకే ఆమె లిప్ సర్జరీ చేయించుకుంది ఏమో అనే అనుమానాలు తలెత్తేందుకు కారణమైందని అంటున్నారు.అయితే ఈ విషయాన్ని కీర్తి సురేష్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే తమను తాము అందంగా చూపించుకోవడం కోసం హీరోయిన్లు ఇలా సర్జరీలు చేయించుకోవడం కొత్త ఏమీ కాదు.గతంలో కాజల్ అగర్వాల్ కూడా ఇలాగే లిప్ సర్జరీ చేయించుకుంది అని, ముక్కుకు సంబంధించిన సర్జరీ కూడా చేశారని ప్రచారం జరిగింది.

keerthy suresh did surgery to her lips

keerthy suresh did surgery to her lips

Keerthy Suresh : నిజ‌మెంత‌?

అలాగే శృతిహాసన్ అయితే తాను స్వయంగా సర్జరీలు చేయించుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది కూడా. వారి బాట‌లోనే కీర్తి సురేష్ కూడా స‌ర్జ‌రీ చేయించుకుంద‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం కీర్తి సురేష్.. నాని స‌ర‌స‌న ద‌స‌రా సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమా కీర్తికి మంచి పేరు తీసుకు రావాల‌ని ఆమె అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సర్కారు వారి పాట సినిమా సక్సెస్ కావడంతో కీర్తికి ముందు ముందు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి. స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మ కొట్టేస్తుందో లేదో చూడాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది