Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2025,9:10 pm

ప్రధానాంశాలు:

  •  Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ త‌ర్వాత ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. రొమాంటిక్ డ్రామా నుంచి పౌరాణికం వరకూ దిల్ రాజు చేయ‌నున్నాడు. ముందుగా రౌడీ జ‌నార్ధన చిత్రం చేయ‌నుండ‌గా, ఈ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. పక్కా కమర్షియల్ టచ్‌తో కూడిన ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Dil Raju త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : లిస్ట్ పెద్ద‌దే..

ఇక మరో ప్రాజెక్ట్ “ఎల్లమ్మ”, ఇది ఓ పవర్‌ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ కథగా వినిపిస్తోంది. ఇందులో నితిన్ కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రారంభంలో ఈ పాత్ర కోసం సాయి పల్లవి, కీర్తి సురేష్ లను సంప్రదించినప్పటికీ, ఇంకా ఫైనల్ అయ్యే హీరోయిన్ ఎవరన్నది అధికారికంగా ప్రకటించలేదు. కథకు తగ్గ నటి ఎంపికపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. పౌరాణిక థీమ్స్‌తో కూడిన వెబ్ సిరీస్‌ పేరు “జటాయు”. ఇది 8 ఎపిసోడ్లుగా రూపొందనుండగా, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

తెలుగు ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వాలని లక్ష్యంగా ఉంచుకుని రూపొందించనున్న ఈ సిరీస్‌ కోసం భారీ బడ్జెట్‌ను ఖర్చుచేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. మొత్తానికి వెండితెర‌తో పాటు ఓటీటీ రంగంలో కూడా అడుగుపెట్టిన దిల్ రాజు.. విజయ్ దేవరకొండ, నితిన్, కీర్తి సురేష్ లాంటి స్టార్ యాక్టర్లతో కలసి, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్టులు త్వరలోనే అధికారికంగా లాంచ్ కానున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది