Home » Entertainment » Keerthy Suresh Emotional Note
Entertainment

Keerthy Suresh : ఎమోష‌న‌ల్ నోట్ రాసిన కీర్తి సురేష్‌.. అందులో ఎముందో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Published on: June 3, 2022, 8:00 pm
Advertisement

Keerthy Suresh : నేను శైల‌జ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కీర్తి సురేష్ మహానటిగా మనందరి హృదయాలు దోచుకుంది.. కళావతిగా యువహృదయాలను కలవర పెట్టించింది. అయినా కానీ తనకెప్పుడు తన నటన సంతృప్తిని ఇవ్వలేదని చెబుతోంది కీర్తి సురేష్.. నటన మీద తనకున్న ప్యాషన్ ఇంకా బాగా చేయాలని అని ప్రతి సినిమాకు ముందు అనుకుంటుందట. నటిగా అన్ని తరహా పాత్రలు పోషించాలి.. అదే విధంగా కమర్షియల్ గాను ఆ సినిమా విజయం సాధించాలి.. అప్పుడే ఓ నటికి నిజమైన సంతృప్తి కలుగుతుంది అని అంటోంది కీర్తి.
కీర్తి కృత‌జ్ఞ‌త‌లు..

Advertisement

కీర్తి సురేష్ నటించిన `సాని కాయిదం`.. `సర్కార్ వారి పాట` చిత్రాలు పెద్ద విజయాలు అందుకున్నాయి. అదే క్రమంలో ముందుగా తన టీమ్ లకు ధన్యవాదాలు తెలిపింది. కీర్తి సురేష్ షేర్ చేసిన నోట్ లో ఇలా ఉంది. “ప్రియమైనవారందరికీ నా మాట ఇది.. నటిగా ఉండటం అనేది హానికర ఎగుడుదిగుడు ప్రయాణం.. మనం ఎత్తులు పల్లాలను చూస్తాము. ఈ ప్రయాణం తరచుగా మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇటీవలి గతం నాకు పరీక్షా సమయం లాంటిది.. ఇది ఒక దశ. ప్రపంచానికి నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడానికి నేను నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది“ అని ఎమోషనల్ నోట్ రాసింది.

keerthy suresh emotional note

Advertisement

ప్రస్తుతం పరిశ్రమలో కొనసాగుతున్న తన అందమైన ప్రయాణం గురించి కూడా కీర్తి వివరించింది. తన సినిమా సాని కాయిదం – సర్కారు వారి పాట భారీ విజయాలను అందుకోవడంతో ఇరు చిత్ర బృందాలకు కీర్తి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రయాణంలో ప్రతి దశలోనూ తనపై నమ్మకం ఉంచినందుకు దర్శకులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.సర్కార్ వారి పాటలో కీర్తి పూర్తిగా విరుద్ధమైన పాత్రలో కనిపించింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఎన్నారై రౌడీ రాణిగా కనిపించింది. ఈ రెండు పాత్రలు నటిగా తనకు మంచి పేరు తెచ్చాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి