Keerthy Suresh : ఇష్టమైన దానికి ముద్దులిచ్చిన కీర్తి సురేశ్.. పిక్స్ వైరల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Keerthy Suresh : ఇష్టమైన దానికి ముద్దులిచ్చిన కీర్తి సురేశ్.. పిక్స్ వైరల్..!

Keerthy Suresh : ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కాలంలో ‘మహానటి’గా ప్రూవ్ చేసుకుంది కీర్తి సురేశ్. నేషనల్ అవార్డు గెలుచుకుని ఆ తర్వాత కాలంలో అత్యద్భుతమైన చిత్రాల్లో యాక్ట్ చేసి సినీ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది కీర్తి. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో కీర్తికి సంబంధించిన పాత ఫొటోలు వైరల్ అవుతున్నాయి.తన కుక్క నైకీతో కీర్తి సురేశ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతున్నాయి. నైకీని ముద్దు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :10 October 2021,8:02 pm

Keerthy Suresh : ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కాలంలో ‘మహానటి’గా ప్రూవ్ చేసుకుంది కీర్తి సురేశ్. నేషనల్ అవార్డు గెలుచుకుని ఆ తర్వాత కాలంలో అత్యద్భుతమైన చిత్రాల్లో యాక్ట్ చేసి సినీ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది కీర్తి. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో కీర్తికి సంబంధించిన పాత ఫొటోలు వైరల్ అవుతున్నాయి.తన కుక్క నైకీతో కీర్తి సురేశ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతున్నాయి. నైకీని ముద్దు పెట్టుకుని కీర్తి ఫొటోకు ఫోజులిచ్చింది. కీర్తి సురేశ్ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

keerthy suresh photos became viral in social media

keerthy suresh photos became viral in social media

తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది కీర్తి. కీర్తి ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న ఈ టైంలో కీర్తి సురేశ్ సిస్టర్ రోల్స్‌కు కూడా ఓకే చెప్తూ సినీ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తుంది.సూపర్ స్టార్ రజనీ కాంత్ -శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘అన్నాత్తె’ చిత్రంలో కీర్తి సురేశ్ రజనీకాంత్‌కు సిస్టర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో ఏకంగా మెగాస్టార్ చిరుకు చెల్లెలిగా నటిస్తోంది. ఈ చిత్రం తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’ రీమేక్. మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

Keerthy Suresh : నైకీతో ఎంజాయ్ చేసిన ‘మహానటి’..!

keerthy suresh photos became viral in social media

keerthy suresh photos became viral in social media

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల మహేశ్ బర్త్ డే సందర్భంగా విడుదల కాగా అది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. డైరెక్టర్ సెల్వరాఘవన్ హీరోగా వస్తున్న ‘సాని కాయిధమ్’ చిత్రంలో కీర్తి డిఫరెంట్ రోల్ ప్లే చేస్తోంది. మలయాళంలో ‘వాశి’ అనే చిత్రంలోనూ కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది