నాగ చైతన్య కి కీర్తి సురేష్ నో చెప్పిందా.. అవునన్న మాటే వినిపిస్తోంది. ఆ మధ్య శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మజిలీ సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవితో జోడి కట్టి లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ చిత్రీకరణలో ఉండగానే మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు ఈ యంగ్ హీరో. కాగా రీసెంట్ గా లవ్ స్టోరీ కంప్లీట్ చేసిన నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో తెరకెక్కనున్న థాంక్యూ సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే విక్రమ్ కే కుమార్ కి అక్కినేని ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. మనం సినిమా తర్వాత విక్రమ్ కే కుమార్ .. అక్కినేని ఫ్యామిలీలో ఒక మెంబర్ గా అయిపోయాడు. అందుకే ఎక్కువగా అక్కినేని హీరోలతోనే విక్రమ్ కే కుమార్ సినిమాలు చేస్తున్నాడు. కాగా నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో లీడ్ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతం డైలమాలో ఉందట. ఈ సినిమా లో ముగ్గురు హీరోయిన్ లు నటించే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్ లను ఫిక్స్ చేశారని చెప్పుకుంటున్నారు.
అవికా గౌర్, మాళవిక నాయర్ లను మేకర్స్ దాదపుగా ఫైనల్ చేసినట్టు లేటెస్ట్ అప్‌డేట్. అయితే లీడ్ రోల్ కి స్టార్ హీరోయిన్ ని తీసుకుందామన్న ఆలోచనలో ఉన్న దర్శక, నిర్మాతలు ..ఈ పాత్ర కోసం టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ ను సంప్రదించారని టాక్. కానీ కీర్తి నో చెప్పిందని ఇండస్ట్రీ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ముగ్గురు హీరోయిన్ లు ఉన్న ఈ సినిమాలో తనకు అంతగా ప్రాధాన్యత లేదనుకునే నో చెప్పేసిందని చెప్పుకుంటున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుని ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్. త్వరలో మహేష్ బాబు తో సర్కారు వారి పాట కూడా చేయబోతోంది. ఆ కారణంగానే ఈ సినిమా వదులుకుందని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ప్రస్తుతం పూజా హెగ్డే లేదా రష్మిక మందన్న లలో ఒకరిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.