ప్రభాస్ లేకుండా భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ మొదలబోతుందా .. అవుననే మాట బీ టౌన్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం కంప్లీట్ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా సంక్రాంతి పండుగ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందబోతోంది. కాగా ఈ సినిమా ని 4 నెలల్లో టాకీపార్ట్ కంప్లీట్ చేసి విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు.
భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న సలార్ ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. 2020 లో ప్రభాస్ నుంచి ఏ సినిమా రాకపోవడం తో 2021 లో కనీసం రెండు సినిమాలని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే రాధే శ్యాం సమ్మర్ కి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మే నెలలో భారీ స్థాయిలో ప్రభాస్ రాధే శ్యాం రిలీజ్ చేయాలని నిర్మాతలు పక్కాగా డిసైడై ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ప్రభాస్ – ప్రశాంత్ నీల్ ల సలార్ కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయబోతున్నారు.
అయితే ఈ నెలలోనే సలార్ తో పాటు ప్రభాస్ నటించబోతున్న ఆదిపురుష్ కూడా సెట్స్ మీదకి వెళ్ళబోతోందని తాజా సమాచారం. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నాడు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా జనవరి 19 నుంచి ఆదిపురుష్ గ్రీన్ మ్యాట్ స్టూడియోలో షూటింగ్ మొదలవబోతోందట. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనడం లేదని సమాచారం. ఇక ఎక్కువభాగం భారీ గ్రీన్ మ్యాట్ సెట్ లోనే ఆదిపురుష్ షూటింగ్ జరుగుతుందని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు.
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
This website uses cookies.