Keerthy Suresh : ట్రెండీవేర్‌లోను మ‌తులు పోగొడుతున్న కీర్తి సురేష్‌… ఏమా అందం అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Authored By Sam C | The Telugu News | Published on: May 13, 2022, 12:30 pm

Keerthy Suresh: టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ వెళుతుంది. తెలుగు, తమిళం, మలయాళీ సినిమాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. విభిన్న పాత్రలో కనిపిస్తూ తన అభిమానులు ఖుషీ చేస్తోంది. తాను న‌టించిన చిత్రాలు ఒక్కొక్క‌టిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌గా, వాటికి భిన్న‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో వచ్చిన ‘సఖి’చిత్రంతో కీర్తిసురేష్ జనవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం మిశ్రమ స్పందనను పొందింది. మరోవైపు విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తను తమిళ భాషలో నటించిన మరో చిత్రం ‘సాని కాయితం’ మే 6న రిలీజ్ అయ్యింది.

కీర్తి సురేశ్, సెల్వ రాఘవన్ నటించిన ఈ క్రైమ్ డ్రామా ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు తో కలిసి కీర్తి సురేష్ స‌ర్కారు వారి పాట అనే యాక్షన్ కామెడీ చిత్రంలో నటించింది. ఈ సినిమా మే 12న విడుద‌ల కాగా, మూవీకి మిక్స్ డ్ టాక్ ల‌భించింది. భారీ అంచ‌నాలు ఈ సినిమాపై పెట్టుకోగా నిరాశే ఎదురైంది. ఇలా కీర్తి తను నటించిన చిత్రాల్లో ఒక్కొక్కోటిగా రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా కీర్తి ఓ అవార్డ్ వేడుక‌కి హాజ‌రు కాగా అక్క‌డ క్యూట్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంది.కీర్తి షేర్ చేసుకున్న ఫొటోలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

keerthy suresh stunning looks

keerthy suresh stunning looks

Keerthy Suresh : ర‌చ్చ లేపుతున్న కీర్తి

ట్రెండీ దుస్తుల‌లో కీర్తి సురేశ్ గ్లామర్ షో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. నడుమందాలు చూపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోందీ బ్యూటీ. స్లిమ్ ఫిట్ బాడీలో మతిపోయేలా పోజులిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కీర్తి సురేష్ క్యూట్ లుక్స్‌పై నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కీర్తి గ్లామ‌ర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం కీర్తి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కేరీర్ ను ప్రారంభించిన హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగులో తొలుత ‘నేను శైలజా’ చిత్రంలో నటించింది. రామ్ పోతినేని సరసన నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. 2016లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులకు కాస్తా మెప్పించగలిగింది. ఆ తర్వాత నాని ‘నేను లోకల్’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp