Keerthy Suresh : కీర్తి సురేష్‌కి ఏమైంది.. చాలా నిరాశ‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది..!

Authored By Sam C | The Telugu News | Published on: April 30, 2022, 5:30 pm

Keerthy Suresh : మ‌హాన‌టి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌డం అందుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం క‌థానాయిక‌గా న‌టిస్తూనే మ‌రోవైపు లేడి ఓరియెంటెడ్ నేప‌థ్యంలో సినిమాలు చేస్తుంది. కీర్తి చేసిన అన్నిలేడి ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇక మధ్యలో కీర్తి బరువు పెరిగిందని ట్రోల్స్ రావడం .. దాన్ని సీరియస్ గా తీసుకున్న ఈ భామ బరువు తగ్గి నాజూకుగా మారడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే కీర్తి సన్నబడ్డాకా ఆమె ఫేస్ కళతప్పిదని పలువురు నొక్కి వక్కాణిస్తున్నారు.సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, ఇందులో కళావతి పాటను కూడా ట్రోల్ చేయడం మానలేదు.

ఛార్మింగ్ మహేష్ పక్కన కళావతి కళ లేకుండా ఉన్నదని, ఫేస్ లో గ్లోనెస్ తగ్గడం సహా ఎక్స్ ప్రెషన్స్ పరంగాను వీక్ గా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఏదేమైన తాను మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్టు దూసుకుపోతుంది. ఈ అమ్మ‌డు తాజాగా ఫొటో షూట్ చేయగా ఇందులో ఓర చూపులు చూస్తూ క‌నిపించింది. ఏదో జ‌రిగింద‌న్నట్టు అమాయ‌కంగా చూస్తూ అంద‌రిని టెన్ష‌న్ పెట్టిస్తుంది. కీర్తి సురేష్ స్ట‌న్నింగ్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు.కీర్తి సురేష్‌కు ఇటు తెలుగుతో పాటు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు చిత్రాల్లో నటిస్తూనే అక్కడ తమిళంలో ఆమె నటిస్తున్నారు.

keerthy suresh stunning looks

keerthy suresh stunning looks

Keerthy Suresh : కీర్తి ప‌రిస్థితి ఏంటి?

అందులో భాగంగా కీర్తి నటించిన లేటెస్ట్ సినిమా అరుణ్ మహేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ‘సాని కాయిధం’. ఈ సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామర్ పాత్రలో కనిపించారు. అంతేకాదు మరోసారి తన నటనతో కేకపెట్టించారు. ఆమె ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు.కీర్తి సురేష్‌కు ఇటు తెలుగుతో పాటు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు చిత్రాల్లో నటిస్తూనే అక్కడ తమిళంలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుంది. కీర్తి గత సినిమాలు పెంగ్వీన్ కూడా ఇలానే ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్’లో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను మే 6వ తేదీన విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp