keerthy Suresh Turned To be thief
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ తాజాగా సర్కారు వారి పాట సినిమాలో కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో కీర్తి పాత్రకు మంచి క్రేజ్ దక్కింది. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కీర్తి సురేష్, మహేశ్ బాబు. ఇందులో భాగంగా శనివారం (మే 21) పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనలని పంచుకున్నారు.ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కీర్తి నన్ను తిట్టాలి. 3 టేకులు తీసుకున్నప్పటికీ కీర్తి చేయలేకపోయింది.
ఆ సమయంలో పరశురాం ఆమె దగ్గరకు వెళ్లి ‘మేడమ్.. మీరు సార్‌ను తిట్టాలి. గుర్తుపెట్టుకోండి ఆయన్ను మీరు తిట్టాలి.’ అని చాలాసార్లు చెప్పారు. కీర్తి ఇబ్బందిపడుతోందని నాకు అర్థమైంది. అప్పుడు నేను ‘పర్వాలేదు కీర్తి.. నన్ను నువ్వు తిట్టు’ అని చెప్పాను. దానికి ఆమె ‘సార్.. నేను మిమ్మల్ని తిట్టలేను. ఒకవేళ నేను మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ నన్ను ఏదో ఒకటి అంటారు.’ అని చెప్పింది. ‘నా ఫ్యాన్స్ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు.’ అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తయ్యేలా చేశాం. ఇక కీర్తి సురేష్‌ని ఓ నెటిజన్స్ ఆసక్తికర ప్రశ్న వేశాడు.సర్కారు వారి పాట మూవీలో మీరు మహేష్ బాబు పర్స్ కొట్టేస్తారు, అలాగే నిజ జీవితంలో కూడా ఎవరిదైనా పర్స్ దొంగిలించారా? అని అడిగారు. కీర్తి బోల్డ్ ఆన్సర్ కి అందరూ ఫిదా అయ్యారు.
keerthy Suresh Turned To be thief
తన తండ్రి పర్స్ కొట్టేసినట్టు చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. ఆవిడ తల్లి మేనక మాజీ హీరోయిన్ కాగా తండ్రి సురేష్ దర్శకుడు. అలా చిత్ర పరిశ్రమలో కీర్తి పుట్టిపెరిగారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి పలు చిత్రాల్లో నటించారు. మరి ఆ సమయంలో కీర్తి సురేష్‌కి పర్స్ దొంగతనం చేయాలని ఎందుకు అనిపించిందో. దర్శకుడు పరుశురామ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటరైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సముద్ర ఖని, నదియా, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ కీలక రోల్స్ చేశారు. సర్కారు వారి చిత్రానికి థమన్ సంగీతం అందించారు.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.