Bigg Boss OTT Telugu : ఓటీటీ వీక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన రియాలిటీ షో బిగ్ బాస్. నాన్‌స్టాప్‌గా ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన ఈ గేమ్ షో ఎట్టకేలకు ముగిసింది. అఖిల్ సార్థక్‌తో పోటీ పడుతూ చివరకు టైటిల్ విన్నర్‌గా నిలిచారు బిందు మాధవి. అంతేకాదు ప్రైజ్‌మనీ రూ.40లక్షలు సొంతం చేసుకున్నారు. ఈ పోటీలో బిందు మాధవి, అఖిల్ సార్థక్, యాంకర్ శివ, అరియానా గ్లోరి, మిత్రా శర్మలు టాప్ ఫైవ్‌లో ఉండగా.. బిందు మాధవి ఆడియెన్స్ మనస్సును దోచుకున్నారు.. విన్నర్‌గా నిలిచారు. గ్రాండ్ ఫినాలేలో ఎఫ్3 టీమ్ దర్శకుడు అనిల్ రావిపూడి, సునీల్ డబ్బుతో నిండిన సూట్‌కేసును తీసుకురాగా.. డబ్బులు తీసుకునేందుకు అరియానా, శివ ముందుకు వచ్చారు. తనకు ఇల్లు కొనక్కుకోవడానికి డబ్బులు అవసరం అంటూ అరియానా రూ.10లక్షలు ఉన్న సూట్ కేసును తీసుకున్నారు.
అఖిల్ మరోసారి రెండవ స్థానంతో సరిపెట్టుకున్నారు.బిగ్ బాస్ టీవీ షోలల్లో అలరించి, టైటిల్ సాధించే దిశగా సాగిన పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్‌లోనూ కనిపించారు. వీరందరి నుంచి బిందు మాధవికి గట్టి పొటీనే ఎదురైంది. అయినా కూడా వారందరినీ వెనక్కు నెట్టేసిన బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ వెర్షన్‌లో తొలి లేడీ విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ కొత్త ఫార్మాట్‌లో మొత్తం 18మంది కంటెస్టెంట్‌లు పాల్గోన్నారు. అజయ్ కుమార్, అఖిల్ సార్థక్, బిందు మాధవి, హమీదా, మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, తేజస్విని మదివాడ, శ్రీ రాపాక, అరియానా, శివ, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, బాబా భాస్కర్, నటరాజ్‌మాస్టర్, అషురెడ్డి, సరయు కంటెస్టెంట్స్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ సరికొత్త ఫార్మాట్ మొదటి సీజన్ 84 రోజుల పాటు నడిచింది.విన్నర్‌గా నిలిచిన బిందు మాధవి తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఖిల్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచే మద్దతు రాగా… బిందు మాధవికి మాత్రం తెలుగుతో పాటు తమిళం నుంచి కూడా భారీ ఎత్తున మద్దతు లభించింది. దీంతోనే అఖిల్‌ను వెనక్కు నెట్టిన బిందు మాధవి విజేతగా నిలిచిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. టాప్ 3లో శివ నిలవగా, నాలుగో స్థానంలో అరియానా నిలిచింది. ఐదు,ఆరు, ఏడు స్థానాలలో మిత్రా శర్మ, బాబా భాస్కర్, అనీల్ ఉన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.