KGF 2 Movie First Day Collections : కేజీఎఫ్ 2 సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. రాఖీభాయ్ ఎక్క‌డా త‌గ్గ‌ట్లేగా..

 Authored By mallesh | The Telugu News | Updated on :15 April 2022,2:30 pm

KGF 2 Movie First Day Collections : ప్రస్తుతం కేజీయఫ్ 2 స్పీడు చూస్తుంటే ఈ సినిమా బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లోనూ దుమ్ములేపే కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. యశ్ అదిరిపోయే నటనకు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి ప్రేక్షకులు.. సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేజీఎఫ్ కంటే చాప్ట‌ర్ 2 అంతకు మించి అన్నట్టుగా థియేటర్లలో దూసుకుపోతూండటం విశేషం. విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్‏లో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది.

క‌న్న‌డ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి ప‌రిచ‌యం చేసిన చిత్రం ‘కేజీఎఫ్’. అప్ప‌టివ‌ర‌కు క‌న్న‌డ సినిమాలను ఇత‌ర‌ ఇండ‌స్ట్రీ వాళ్లు అంత‌గా ప‌ట్టించుకులేదు. అలాంటి స‌మ‌యంలో రిలీజైన కేజీఎఫ్ చిత్రంతో అంద‌రూ క‌న్న‌డ ఇండ‌స్ట్రీ గురించి చ‌ర్చింకున్నారు. ఎలాంటి అంచనాల్లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం విడుద‌లైన ప్ర‌తి ఏరియాలో వ‌సూళ్ల‌ సునామీని సృష్టించింది. ‘బాహుబ‌లి’ త‌ర్వాత ఆ స్థాయిలో కేజీఎఫ్ చిత్రం బాలీవుడ్‌లో జెండా పాతింది. ఇండియన్ సినిమాలో అలాంటి ఎలివేష‌న్‌లు ఎక్క‌డా చూడ‌లేదు. ప్ర‌శాంత్ నీల్ టేకింగ్‌కు, విజ‌న్‌కు సినీప్రముఖులు సైతం అశ్చ‌ర్యంలో ప‌డ్డారు. అప్ప‌టివ‌ర‌కు అస‌లు మొహం కూడా తెలియ‌ని య‌ష్ ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ చిత్రంలో య‌ష్ న‌ట‌న‌, ఆటిట్యూడ్‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌ట్టారు.

KGF 2 Movie First Day Collections

KGF 2 Movie First Day Collections

కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే.. తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ 2 మూవీ రూ. 33 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం కలిపి రూ. 50 కోట్లు వసూలు చేసిందట. మొత్తానికి దేశవ్యాప్తంగా కేజీఎఫ్ 2 కలెక్షన్స్ రూ.130 కోట్లు.. అంటే రూ. 150 కోట్ల‌ గ్రాస్ రాబట్టినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలో సంజయ్ దత్ విల‌న్ గా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా న‌టించారు. అలాగే ప్రకాష్ రాజ్, రావు రమేష్, రవినా టాండన్, కీలకపాత్రలలో నటించారు. గరుడను చంపిన రాకీభాయ్‌గా, ఫస్ట్ పార్ట్ లో చూపించిన సేమ్‌ మేనరిజమ్‌, సేమ్‌ డైలాగ్‌ డెలివరీతో మాస్‌లో ఫైర్‌ పుట్టించే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు యశ్.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి