KGF 2 Movie : ఆర్ఆర్ఆర్ తర్వాత సౌత్ నుండి విడుదలైన మరో సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ 2. కన్నడ రాకింగ్ స్టార్ యశ్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ చిత్రం 10వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. అంతకుముందు సెన్సెషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కడంతో కేజీఎఫ్-2పై భారీ ఎక్సపెక్టేషన్స్ నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా యశ్ డైలాగ్స్ సూపర్బ్‌గా ఉండడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. దేశం మొత్తం ఈ చిత్రం కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది.
యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది.తాజాగా కేజీఎఫ్ 2 థియేటర్‌లో ఊహించని సంఘటన ఎదురైంది. హీరో, విలన్ల మధ్య భారీ కాల్పులు, పోరాట దృశ్యాలు చూస్తూ ప్రేక్షకులు మైమరచిపోయారు. అదే సమయంలో ఉన్నట్టుండి లైవ్‌లో తూటాల సౌండ్ వినిపించడంతో ప్రేక్షకులు పరుగులు తీసారు. కర్ణాటకలో హావేరి జిల్లా శిగ్గావి పట్టణంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సెకండ్ షో చూస్తుండగా వసంతకుమార అనే ప్రేక్షకుని కాలు ముందు కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తగిలింది. దాంతో గొడవ పడ్డారు. అతను బయటకు వెళ్లి పిస్టల్‌తో తిరిగొచ్చి ఏకంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండు తూటాలు వసంత కాలు, కడుపులోకి దూసుకెళ్లాయి. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నిందితుడు మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపారని, ఒకటి గాలిలోకి, రెండుసార్లు బాధితుడి కడుపుపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. . మొదటి రౌండ్ కాల్పులు జరగడంతో, వసంతకుమార్ స్నేహితులతో సహా థియేటర్‌లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారని.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ట్రీట్మెంట్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేజీఎఫ్ 2 విషయానికి వస్తే హీరో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఓ లెవెల్‌లో ఉన్నాయి. అలాగే బీజీఎం కూడా అదరిపోయింది. గ్రాండ్ విజువల్స్‌తో పాటు రాఖీ భాయ్‌గా యశ్- అధీరాగ సంజు బాబా యాక్షన్ ఎపిసోడ్స్ వేరే లెవల్లో ఉన్నాయి.
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
This website uses cookies.