
Chiranjeevi Ram Charan Also That power is gone
Ram Charan : ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన రామ్ చరణ్ ఇప్పుడు ఆచార్య సినిమాతో పలకరించబోతున్నాడు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్, కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గత నాలుగేళ్లుగా చరణ్, చిరుతో కలిసి ఉండడం లేదని చెప్పుకొచ్చాడు.
తన తండ్రితో కలిసి షూటింగ్ చేయడంపై స్పందించిన రామ్ చరణ్.. నిజంగా ఆ ఎక్స్ పీరియన్స్ మాటల్లో చెప్పలేను. 20 రోజులు పైన మేము ఇద్దరం కలిసే ఉన్నాం.. మా ఇద్దరికీ ఒకే కాటేజ్ ఇచ్చారు. నేను గత నాలుగేళ్లుగా వేరే ఇంట్లో ఉంటున్నా.. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కన్ స్ట్రక్షన్ జరుగుతున్న కారణంగా మేము ఇద్దరం వేరే వేరు గా ఉంటున్నాం. సండేస్ మాత్రమే కలుస్తున్నాం. ఆ సమయంలో ఇలాంటి ఒక అవకాశం వచ్చింది. నెల రోజులు మేము ఇద్దరం పొద్దున్నే లేవడం.. కలిసి భోజనం చేయడం..కలిసి ఒకే కారులో షూటింగ్ కు వెళ్లడం.. షూట్ అయిపోగానే ఇద్దరం కలిసి ఒకే కారులో తిరిగి రావడం అంతా కొత్త అనుభూతి.
ram charan comments on Chiranjeevi
ప్రతీ రోజు మార్నింగ్ 5:30 గంటలకు లేచి కలిసి వర్కవుట్ లు చేయడం..అది నా జీవితంలో మోస్ట్ మెమోరబుల్ టైమ్. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నాకు ఇలా ఉంటె నాన్నగారు ఐదో రోజో .. ఆరో రోజో పిలిచి చరణ్ నీకు అర్ధం కావడం లేదు. ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు.. ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు. ‘ఆచార్య’ వల్ల మనకు ఈ అవకాశం వచ్చింది. షూటింగ్‌కి ముందు లేదా తరువాత ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేద్దాం. మళ్లీ నీతో నాకు ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇంత మంచి కథలో మనం కలిసి నటించడం ప్రతిసారీ కుదరదు అన్నాడు. నాన్న నన్ను హత్తుకున్నపుడు నాకు కన్నీళ్లు వచ్చాయంటూ ఎమోషనల్ అయ్యాడు చరణ్.
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
This website uses cookies.