KGF 3 : కేజీఎఫ్ 3 లో రానా న‌టించ‌బోతున్నాడా… అంచ‌నాలు పీక్స్‌లో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KGF 3 : కేజీఎఫ్ 3 లో రానా న‌టించ‌బోతున్నాడా… అంచ‌నాలు పీక్స్‌లో..!

 Authored By sandeep | The Telugu News | Updated on :7 May 2022,5:30 pm

KGF 3: ఇటీవ‌ల కాలంలో విడుద‌లై బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రం కేజీఎఫ్ 2. కేజీఎఫ్‌కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. సొంత ఇలాకాలో మాత్రం కేజీఎఫ్ 2 మాత్రం కాస్త వెనబడిందనే చెప్పాలి. కేజీఎఫ్ 2 ఈ రేంజ్ సక్సెస్ వెనక నార్త్ ఆడియన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 2022లో బీటౌన్‌లో ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు తాజాగా కేజీఎఫ్ 2 ఆమీర్ ఖాన్ ‘దంగల్’ లైఫ్ టైమ్ ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను దాటి సంచలనం రేపింది. సొంత ఇలాకాలో కర్ణాటకలో బ్రేక్‌ ఈవెన్‌కు దూరంలో ఉంది.

ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి రూ. 78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా ఈ సినిమా రూ. 80.90 కోట్ల (రూ. 130.65 కోట్ల గ్రాస్ ) రాబట్టింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం KGF 3 లో విలన్ గా దగ్గుబాటి వారసుడు రానా నటించబోతున్నారట. ఈ మధ్యనే సినిమా కు సంబంధించిన పనుల్లో ప్రశాంత్ కి కంగ్రాట్స్ చెప్పుతూ రానా ట్వీట్ చేశాడు..దీనికి ప్రశాంత్..ధ్యాంక్యూ..తవరలోనే కలుద్దాం అని రిప్లై ఇచ్చాదు, దీంతో ..KGF 3 లో విలన్ గా రానా ని ఫిక్స్ చేశాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.

kgf 3 villain is rana

kgf-3 villain is rana

 

KGF 3 : ఇక బ‌ద్ద‌లే..

కేజీయఫ్‌’ సినిమాల సిరీస్‌లో హీరో ఎంత ఫేమసో, విలన్లు కూడా అంతే ఫేమస్‌. సినిమాలో హీరో యశ్ అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. దీంతో విలన్‌ గా రానా అయితే సినిమా కి మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.ఇప్పటికే రానా విలన్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు ..భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కు ప్రత్యర్ధి పాత్రలో రానా ఇరగదీశాడు. తాజా గా వైరల్ అవుతున్న వార్త నిజమైతే సినిమా కి మరింత హైప్ ఇచ్చిన్నత్లే అవుతుందంటున్నారు సినీ విశ్లేషకులు. రాన న‌టంచిన విరాట‌ప‌ర్వం జూలైలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా మంచి వినోదం పంచ‌నుంద‌ని అంటున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది