కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ రిలీజ్ ... ప్రశాంత్ నీల్ దమ్మేంటో చూపించాడు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ రిలీజ్ … ప్రశాంత్ నీల్ దమ్మేంటో చూపించాడు ..!

కేజీఎఫ్ చాప్టర్ 2 .. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల తో పాటు ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ రిలీజైంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 తో పాన్ ఇండియన్ స్టార్స్ గా క్రేజ్ ని సంపాదిచుకున్న యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఛాప్టర్ 2 రూపొందింది. కాగా గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రతీ ఒక్కరు […]

 Authored By govind | The Telugu News | Updated on :7 January 2021,10:57 pm

కేజీఎఫ్ చాప్టర్ 2 .. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల తో పాటు ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ రిలీజైంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 తో పాన్ ఇండియన్ స్టార్స్ గా క్రేజ్ ని సంపాదిచుకున్న యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఛాప్టర్ 2 రూపొందింది. కాగా గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రతీ ఒక్కరు ఎదురు చూశారు. కాగా న్యూ ఈ ఇయర్ నుంచి కౌంట్ డౌన్ మొదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ రిలీజైన కేవలం 5 నిముషాలలోనే సునామీని సృష్ఠించేసింది. ఊహించనంతగా వ్యూస్ సాధించి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ దమ్మేంటో మరోసారి ప్రూవ్ అయింది.

KGF: Chapter 2 teaser will be unveiled on this date | Entertainment  News,The Indian Express

కాగా ఈ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయబోతునట్టు ఈ టీజర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ – డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కబోతోంది. త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ సినిమాని కేజీఎఫ్ రెండు భాగాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

KGF Chapter 2 Teaser Out: Superstar Yash & Sanjay Dutt Are All Set To Give  You Maha Entertainment Post A Gloomy 2020

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది