Jr NTR : ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ ఎప్పటి నుండి అంటే..!
ప్రధానాంశాలు:
Jr NTR : ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ ఎప్పటి నుండి అంటే..!
Jr NTR : ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో ‘వార్ 2’ సినిమాతో రానున్న విషయం తెల్సిందే. ఇక ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ సినిమాను ప్రకటించి చాలా కాలం అయింది.

Jr NTR : ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ ఎప్పటి నుండి అంటే..!
Jr NTR అదిరిపోయే అప్‌డేట్..
రెండేళ్ల నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలకు ముందే వీరిద్దరి కాంబో మూవీ గురించిన వార్తలు మొదలు అయ్యాయి. మధ్యలో సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు సైతం వచ్చాయి. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దాంతో సినిమా ఇప్పుడు కాకున్నా కాస్త ఆలస్యంగా అయినా షూటింగ్ ప్రారంభం అవుతుంది, ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే నమ్మకం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో కలిగింది.
ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర దించుతూ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఈనెల 22 నుంచి ఓ భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. మే 15 వరకూ ఈ షూటింగ్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. ఈ ఫైట్ సినిమా మొత్తానికికే హైలెట్ కాబోతోంది.ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను 2026 చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనున్న సలార్ 2 సినిమా సైతం రానుంది.