Balakrishna play playing cards
Balakrishna : నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నాడు కాని ఆయన ప్రతి సినిమాకు హీరోయిన్ ను వెదకడం అనేది దర్శకులకు పెద్ద టాస్క్ గా మారింది. అఖండ సినిమా కోసం ఎంతో మంది హీరోయిన్స్ ను సంప్రదించారు. కొందరు బాలయ్య తో సినిమా ను చేయలేం అంటూ నిర్మొహమాటంగా చెప్పేయడంతో మరి కొందరు మాత్రం బిజీగా ఉన్నామని లేదంటే మరేదైనా కారణంతో తప్పించుకున్నారు. చివరకు పెద్దగా ఫేమ్ లేని ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య 107 సినిమా విషయంలో కూడా అదే జరిగింది.
బాలయ్య 107 సినిమా కోసం పలువురు హీరోయిన్స్ సంప్రదించారు. గోపీచంద్ కు సన్నిహితురాలు అయిన శృతి హాసన్ ను చివరకు ఎంపిక చేశారు. ఆమె కూడా బాలయ్య తో నటించేందుకు ఆసక్తి చూపించలేదట. కాని దర్శకుడు గోపీచంద్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో పాటు పారితోషికం కాస్త ఎక్కువ ఇస్తామని చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. ఇప్పుడు అదే సినిమాలో ఐటెం సాంగ్ విషయంలో బాలయ్య కు మళ్లీ అవస్థలు తప్పడం లేదట. ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ విషయంలో ప్రస్తుతం చర్చోప చర్చలు జరుగుతున్నాయని సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుతోంది.
khiladi heroine don’t want do item song in Balakrishna 107 movie
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఐటెం సాంగ్ కోసం ఖిలాడి బ్యూటీ డింపుల్ హయతీని అడిగారట. గతంలో ఆమె గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. రవితేజ సినిమా ఖిలాడీ లో హీరోయిన్ గా నటించింది. అవేవి ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. పైగా ఖిలాడీ సినిమా ప్లాప్ అయ్యింది. ప్లాప్ ల్లో ఉన్న హీరోయిన్ కూడా బాలయ్య తో సినిమాకు కనీసం ఐటెం సాంగ్ కు ఓకే చెప్పక పోవడం విడ్డూరంగా ఉందంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మాత్రం ఐటెం సాంగ్స్ చేయాలనుకోవడంలో లేదు… కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే చేస్తానంటూ భీష్మించుకుందట. అందుకే బాలయ్య కు ఐటెం గర్ల్ కరువయ్యింది.
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
This website uses cookies.