Koratala Siva Loss For Acharya From Gemini Satellite Rights
Koratala Siva : వరుస విజయాలలో ఉన్న దర్శకుడు కొరటాల శివ మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా చేసి మొదటిసారి కెరీర్‌లో ఫ్లాప్ అందుకున్నారు. కొరటాల మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేసినా అందులో మెగా హీరోలు చేసిన పలు మార్పులు వల్ల కథ, కథనం మారిపోయి కథలో పస లేకుండా పోయింది. ఇద్దరు మెగా హీరోలు స్క్రీన్ మీద కనిపించినా కూడా కనీసం మెగా అభిమానులను కూడా మెప్పించలేకపోయింది ఆచార్య చిత్రం. మణిశర్మ సంగీతం రెజీనా, సంగీతల స్పెషల్ సాంగ్స్ అన్నీ ఉన్నా కలిసి రాలేదు. నిజంగా మెగా ఫ్యామిలీ హీరోలకు ఇది షాక్ అని చెప్పక తప్పదు.
నిర్మాత – డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయినా కూడా దాన్ని మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అలాగే, దర్శకుడు కొరటాల శివ తమ రెమ్యునరేషన్‌లో చాలావరకు తిరిగి ఇచ్చేశారు. ఎంతో కొంత నిర్మాత, డిస్ట్రిబ్యూట్స్‌ను ఆదుకున్నారు. అది కాదు సమస్య..భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య మెగా హీరోల ఖాతాలో హిట్‌గా చేరలేకపోయింది. దాంతో దర్శకుడు కొరటాల శివ ఏకంగా తన సక్సెస్ ఫార్ములా అయినా మేసేజ్ ఓరియెంటెడ్ జోనర్‌ను వదిలేయనున్నట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది. అందుకే, కొరటాల యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయబోతున్న సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాలని చూస్తున్నారట.
Koratala Siva Acharya Effect Success Formula
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను..ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాలన్నిటిలోనూ కొరటాల ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారు. వీటిలో ఆచార్య తప్ప మిగతా నాలుగు సినిమాలు ఆ మేసేజ్ జనాలకు విపరీతంగా నచ్చి భారీ హిట్ అయ్యేందుకు కలిసొచ్చింది. అయినా ఆచార్య సినిమాను దృష్ఠిలో పెట్టుకొని ఈసారి ఎన్టీఆర్ 30వ సినిమాలో మెసేజ్ కంటే కూడా కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమా కొరటాల శివదే. కాబట్టి, పాన్ ఇండియా లెవల్‌లో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరి కొరటాల తన మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాకుండా కమర్షియల్ సినిమా అంటే అది ఎలా ఉంటుందో..జనాలకు ఎంతవరకు ఎక్కుతుందో చూడాలి.
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
This website uses cookies.