Home » Entertainment » Khiladi Is Going To Become Big Hit Than Krack
Entertainment

Khiladi : ఖిలాడి క్రాక్ కంటే పెద్ద హిట్.. టీజర్ టాక్ ఇదే..!

Authored By
vamana sai
The Telugu News | Published on: April 12, 2021, 9:30 pm
Advertisement

Khiladi : మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. తాజాగా ఈ సినిమా నుంచి ఉగాది పండుగని పురస్కరించుకొని ఖిలాడి సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. మూడేళ్ళ తర్వాత క్రాక్ సినిమాతో మంచి ఫాంలోకి వచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ఈ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న మాస్ మహారాజ వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్‌లో పెట్టాడు. ఆ సినిమాలలో ఒకటి ఖిలాడి. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.

Advertisement

khiladi is going to become big hit than krack…!

మీనాక్షి చైదరీ డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడి టైటిల్ పోస్టర్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచాయి. అయితే తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆ అంచనాలను మరో లెవల్‌కి తీసుకు వెళ్ళింది. క్రాక్ సినిమాని మించిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఖిలాడి తెరకెక్కుతోంది.

Advertisement

Khiladi : రవితేజ ఎనర్జీకి తగ్గ సాలీడ్ సినిమా ఖిలాడి..!

“మోషన్స్ లేనివాడిని ఎవరూ ఆపలేరు” అనే డైలాగ్ తో రవితేజ ఖిలాడి ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. అలాగే స్టుపిడ్ ఎమోషన్స్ వద్దంటున్న మరో డైలాగ్ కూడా ఖిలాడి సినిమాలో ఎలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండబోతున్నాయో తెలుస్తోంది. కాగా ఈ సినిమా మే 28న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇక మాస్ మహారాజా ఎనర్జీకి తగ్గ సాలీడ్ సినిమా ఖిలాడి అని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నెక్స్ట్ సినిమా ఉండబోతోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి