Ram Charan : రామ్ చరణ్ మీదే కోటి ఆశలు పెట్టుకున్న హీరోయిన్.. గేమ్ చేంజర్ లో రచ్చ షురూ..!
ప్రధానాంశాలు:
Ram Charan : రామ్ చరణ్ మీదే కోటి ఆశలు పెట్టుకున్న హీరోయిన్.. గేమ్ చేంజర్ లో రచ్చ షురూ..!
Ram Charan : బాలీవుడ్ లో మొన్నటిదాకా టాప్ లీగ్ లో ఉన్న కియరా అద్వాని అనుకోకుండా వెనకపడిపోయింది. అమ్మడికి అక్కడ పెద్దగా అవకాశాలు రావట్లేదు. పెళ్లైంది కాబట్టి ఆఫర్లు తగ్గాయా లేదా మరో కారణమో తెలియదు కానీ కియరా ఫోకస్ అంతా కూడా సౌత్ మీద ఉందని తెలుస్తుంది. సౌత్ ఆడియన్స్ ఆమెను బాగా ఆదరిస్తున్నారు. ఆల్రెడీ తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేసి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఆ సినిమా వర్క్ అవుట్ కాలేదు. ఐతే ప్రస్తుతం చరణ్ తోనే గేమ్ ఛేంజర్ లో నటిస్తుంది కియరా అద్వాని. ఈ సినిమా మీదే అమ్మడు తన హోప్స్ అన్నీ పెట్టుకుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా గేమ్ ఛేంజర్ అదిరిపోతుందని అంటున్నారు.
Ram Charan కెరీర్ సెట్ రైట్ చేసుకునేందుకు..
అంతేకాదు కియరా కి కూడా మళ్లీ కెరీర్ సెట్ రైట్ చేసుకునేందుకు ఈ సినిమా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో కియర గ్లామర్ పరంగా కూడా నో లిమిట్స్ అనే రేంజ్ లో రెచ్చిపోయిందని తెలుస్తుంది. సినిమా చూశాక అన్నిటితో పాటు కియరా గ్లామర్ గురించి కూడా చెప్పుకుంటారని తెలుస్తుంది.
ఇప్పటికే గేమ్ ఛేంజర్ సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. జనవరి 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. మెగా ఫ్యాన్స్ అందరు కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ఆ రేంజ్ ఉంటే మాత్రం రికార్డులను తిరగరాస్తుందని చెప్పొచ్చు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ లో నిర్మించారు. Kiara Advani, Ram Charan, Shankar, Dil Raju