Home » Entertainment » Kiara Advani Responds To Her Love Affair
Entertainment

Kiara Advani : ఎట్ట‌కేల‌కు త‌న ప్రేమ విష‌యంపై నోరు విప్పిన మ‌హేష్ బ్యూటీ

Authored By
Sam C
The Telugu News | Published on: April 28, 2022, 3:00 pm
Advertisement

Kiara Advani: బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందులో కియారా అద్వాని ఒక‌రు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఈ సినిమా నిరాశ‌ప‌ర‌చ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆయ‌న 15వ సినిమాలో న‌టిస్తుంది.

Advertisement

Kiara Advani responds to her love affair

క్లారిటీ ఇచ్చిందిగా..!

కియారా ప్రేమ విష‌యానికి సంబంధించి కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కియారా -సిద్దార్థ్ మ‌ల్హోత్రా బ్రేక‌ప్ అంశం కొంత‌కాలంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్న కియారా త‌న బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేక‌ప్ చెప్పిన‌ట్టు వార్త‌లు హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఈ నేప‌థ్యంలో కియారా అద్వానీ త‌న బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్‌తో ఉన్న పోస్ట‌ర్‌ ఫొటోను షేర్ చేసింది. సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి న‌టించిన షేర్షా సినిమా హిట్ లిస్ట్ ఓటీటీ అవార్డ్స్ లో ఉత్త‌మ వెబ్ సినిమా (హిందీ)గా ఎంపికైంది. సిద్దార్థ్ మ‌ల్హోత్రా ఉత్త‌మ న‌టుడిగా, కియారా ఉత్త‌మ న‌టిగా ఎంపిక‌య్యారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ పోస్ట్ చేసిన ఈ అంశాన్ని కియారా కూడా షేర్ చేసింది.

Advertisement

దీంతో ఇద్దరి మ‌ధ్య విభేదాలు లేవ‌ని అంద‌రు భావించారు. కియారా తాజాగా నటించిన ‘భూల్ భులయ్యా-2’ ట్రైలర్‌ ఈవెంట్‌లో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ‘మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా?’ అని ఓ విలేఖరి కియారాను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె ‘నా జీవితంలో నేను ఇప్పటి వరకు కలిసిన ప్రతి ఒక్కరు నాకు ఇంపార్టెంటే. ఎవరిని మరిచిపోవాల్సిన అవసరం నాకు రాలేదు’ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. ఇది విని ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు. ఈ జంట మధ్య ఏం జరగలేదని, వీరి బ్రేకప్‌ వార్తల్లో నిజం లేదంటూ అభిప్రాయ పడుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి