Mahesh Babu : మ‌హేష్ బాబుని రౌండ‌ప్ చేసి క‌న్ఫ్యూజ్ చేస్తున్న పిల్ల‌లు.. న‌మ్ర‌త పోస్ట్‌కి నెటిజ‌న్స్ సూప‌ర్ రియాక్ష‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : మ‌హేష్ బాబుని రౌండ‌ప్ చేసి క‌న్ఫ్యూజ్ చేస్తున్న పిల్ల‌లు.. న‌మ్ర‌త పోస్ట్‌కి నెటిజ‌న్స్ సూప‌ర్ రియాక్ష‌న్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :13 February 2022,7:40 am

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తూ ఉంటాడు. ఫ్యామిలీతో విహారయాత్ర‌లు, ఇంట్లో స‌ర‌దా స‌మ‌యాలు అన్నింటిని న‌మ్ర‌త త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేస్తూ నెటిజ‌న్స్ కి మంచి వినోదం పంచుతూ ఉంటుంది. తాజాగా మహేష్ మరోసారి కుమారుడు..కుమార్తెతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అయితే ఈసారి గౌతమ్..సితారతో పాటు బ్లాక్ వైట్ పెట్ కూడా ఉంది. మహేష్ చైర్ లో కూర్చుని పెట్ తలపై పై చేయి వేసు నెమురతున్నారు. ఇరు ప్రక్కలా గౌతమ్..సితార నుంచొని ఉన్నారు.

దీనితో నమ్రత ఈ ఫోటోకి గాను మహేష్ ని తన బేబీస్ చుట్టేశాయని పోస్ట్ చేసారు. ఇవి అయితే చూడ్డానికి ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయని చెప్పాలి. పిల్లలు ఇద్దరు పెద్దవాళ్లు అవుతుండటంతో మహేష్ ఇలా లవ్ బుల్ పెట్ తో ఆడుకుంటున్నట్లు తెలుస్తుంది. అభిమానులు మహేష్ ని ఇలా సరదాగా గడుపుతోన్న మూవ్ మెంట్స్ చూసి సంబరపడిపోతున్నారు. ఇక మహేష్ ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా మే 12న విడుద‌ల కానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు.

kids surrounded to mahesh Babu

kids surrounded to mahesh Babu

Mahesh Babu : మ‌హేష్‌ని క‌న్ఫ్యూజ్ చేస్తున్నారుగా..!

రీసెంట్‌గా క‌ళావ‌తి ప్రోమో విడుద‌ల చేయ‌గా, ఇది ఎంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. స‌ర్కారు వారి పాట చిత్రం త‌ర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఇప్పటికే స్ర్కిప్ట్ సహా అన్ని పనులు పూర్తిచేసి టీమ్ రెడీగా ఉంది. తొలి షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేసారు. అలాగే ఇటీవలే మహేష్ ఏపీ లో టిక్కెట్ల ధరల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో జరిగిన భేటీకి హాజరైన సంగతి తెలిసిందే. పరిశ్రమ తరుపున తాను చెప్పాలనుకున్నది స్వయంగా ముఖ్యమంత్రికి వివరించారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది