Varanasi Movie : వారణాసి పార్ట్ 2 పై క్లారిటీ ఇచ్చి రాజమౌళి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varanasi Movie : వారణాసి పార్ట్ 2 పై క్లారిటీ ఇచ్చి రాజమౌళి..!

 Authored By suma | The Telugu News | Updated on :4 February 2026,3:40 pm

ప్రధానాంశాలు:

  •  Varanasi : వారణాసి పార్ట్ 2 రూమర్లకు రాజమౌళి ఫుల్ స్టాప్

Varanasi : టాలీవుడ్ Tollywood  టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి S.S. Rajamouli – సూపర్ స్టార్ మహేష్ బాబు Superstar Mahesh Babu కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ Varanasi పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసే దిశగా ముందుకెళ్తుండగా తాజాగా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు. 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే అదే పోస్టర్ కారణంగా సినిమాకు రెండు భాగాలు ఉంటాయనే రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Varanasi Movie వారణాసి పార్ట్ 2 పై క్లారిటీ ఇచ్చి రాజమౌళి

Varanasi Movie : వారణాసి పార్ట్ 2 పై క్లారిటీ ఇచ్చి రాజమౌళి..!

Varanasi : రెండు పార్టుల ట్రెండ్ .. ప్రేక్షకుల్లో తగ్గుతున్న ఆసక్తి

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో టాలీవుడ్‌లో రెండు పార్టుల Two parts ట్రెండ్ మొదలైంది. కథకు అవసరం ఉన్న చోట రెండు భాగాలుగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని బాహుబలి నిరూపించింది. కానీ ఆ తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా చాలా సినిమాలు పార్ట్ 1, పార్ట్ 2 అంటూ ప్రకటించడం మొదలుపెట్టాయి. దీంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆ ఉత్సాహం కొంత తగ్గింది. “పార్ట్ 2 ఎప్పుడొస్తుంది?”, “అసలు వస్తుందా లేదా?” అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో వారణాసి సినిమాకు కూడా రెండు భాగాలు ఉంటాయన్న వార్తలు రావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. సెకండ్ పార్ట్ కోసం ఇంకెన్ని సంవత్సరాలు వేచిచూడాలన్న ఆలోచన వాళ్లలో మొదలైంది.

Varanasi : పార్ట్ 2 లేదంటూ క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

ఈ రూమర్లకు తెరదించుతూ తాజాగా రాజమౌళి స్వయంగా క్లారిటీ Clarity ఇచ్చారు. వారణాసి ప్రమోషన్స్‌లో aranasi Promotions భాగంగా ఆయన హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పార్ట్ 2 విషయంపై ప్రశ్న రావడంతో రాజమౌళి స్పష్టంగా స్పందించారు. “మొదట్లో వారణాసిని రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. కానీ కథను పూర్తిగా అనాలైజ్ చేసిన తర్వాత ఒక్క సినిమాగా చెబితేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. ఈ సినిమా నిడివి దాదాపు మూడు గంటల వరకు ఉంటుంది” అని తెలిపారు. దీంతో వారణాసికి పార్ట్ 2 లేదన్న విషయం అధికారికంగా బయటకు వచ్చింది. రాజమౌళి మాటలతో మహేష్ బాబు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క సినిమాతోనే భారీ అనుభూతి అందించబోతున్నారన్న నమ్మకం మరింత పెరిగింది. ఇక రాజమౌళి మార్క్ కథనం, విజువల్స్‌తో మహేష్ బాబు కనిపించబోయే ఈ సినిమా ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2027 ఏప్రిల్ 7న వారణాసి ఏ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుందో చూడాలని ప్రేక్షకులు ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది