Kinnera Mogilaiah : కిన్నెర మొగిలయ్యకు ‘పద్మా’భిషేకం.. అసలు ఎవరితను..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kinnera Mogilaiah : కిన్నెర మొగిలయ్యకు ‘పద్మా’భిషేకం.. అసలు ఎవరితను..?

Kinnera Mogilaiah : దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును కిన్నెర వాయిద్య కళాకారుడైన మొగిలయ్యకు ఇస్తున్నట్టు భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అతనితో పాటు మొత్తం 107 మందికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. వివిధ రంగాల్లో వారు చేసిన కృషికి దేశ అత్యున్నత పురస్కారంతో వారిని సత్కరించింది. అయితే, తెలంగాణ నుంచి కిన్నెర వాయిద్యా కళాకారుడికి పద్మ శ్రీ దక్కడంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా మొగిలయ్య చాలా ఆనందంగా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :26 January 2022,3:00 pm

Kinnera Mogilaiah : దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును కిన్నెర వాయిద్య కళాకారుడైన మొగిలయ్యకు ఇస్తున్నట్టు భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అతనితో పాటు మొత్తం 107 మందికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. వివిధ రంగాల్లో వారు చేసిన కృషికి దేశ అత్యున్నత పురస్కారంతో వారిని సత్కరించింది. అయితే, తెలంగాణ నుంచి కిన్నెర వాయిద్యా కళాకారుడికి పద్మ శ్రీ దక్కడంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా మొగిలయ్య చాలా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది.

కిన్నెర మొగిలయ్య తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ అవుసలికుంటకు చెందిన వారు. తెలకపల్లి మండలం గుట్టరాయిపాకులలో మొగిలయ్య జన్మించాడు. ఆయన పెరిగిన ప్రాంతం చుట్టూ నల్లమల అటవీప్రాంతం. ఆయన్నునల్లమల ముద్దుబిడ్డగా అక్కడి ప్రజలు పిలుచుకుంటుంటారు. ప్రకృతి ఒడిలో కిన్నెర వాయిద్యంపై అవపోసన పట్టారు. తన తాత, తండ్రి నుంచి ఈ వారసత్వం సంక్రమించినదని మొగిలయ్య చెప్పుకుంటుంటారు. పూటగడవని టైంలో గ్రామగ్రామాన తిరుగుతూ అందంగా ముస్తాబు చేసిన కిన్నెర వాయిద్యంతో అందరినీ అలరించేవారు.కిన్నెరనే ఆయనకు జీవనోపాధి. కిన్నెర వాయిద్యం కళనే జీవనాధారంగా చేసుకుని బతుకీడుస్తున్నాడు.

kinnera mogilaiah honered with padma sri award

kinnera mogilaiah honered with padma sri award

Kinnera Mogilaiah : మొగిలయ్య ప్రస్థానం

 గతంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి కిన్నెర వాయించి వారు ఇచ్చే దాంతో కాలం వెల్లదీసేవాడు. తెలంగాణ ప్రభుత్వం మొగిలయ్య సేవలను గుర్తించింది. ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని ఆఫర్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్‌’లో టైటిల్ సాంగ్ పాడి ఫేమస్ అయిపోయాడు మొగిలయ్య.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొగిలయ్య అంటే తెలియని వారుండరు. ఈ నేపథ్యంలోనే కేంద్రం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించడంతో మొగిలయ్య ఇన్నాళ్ల కృషికి ఇప్పుడు ప్రతిఫలం దక్కిందని అందరూ అనుకుంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది