Jyothi Rai : గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి ఆంటీలో హాట్‌నెస్సే కాదు, మంచి మ‌నసు ఉంది.. ఏం చేసిందంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jyothi Rai : గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి ఆంటీలో హాట్‌నెస్సే కాదు, మంచి మ‌నసు ఉంది.. ఏం చేసిందంటే..!

Jyothi Rai : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో జ‌గ‌తి మేడ‌మ్ పాత్రలో కనిపించి సంద‌డి చేసింది జ్యోతిరాయ్. పేరుకు కన్నడ నటినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు చాలా ద‌గ్గ‌రైంది. సీరియ‌ల్‌లో చాలా ప‌ద్ద‌తిగా, సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించిన ఈమె సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న హాట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తుంటుంది. జ్యోతిరాయ్ పిక్స్ క్ష‌ణాల‌లోనే నెట్టింట వైర‌ల్ అవుతుంటాయి. అయితే త‌న హాట్‌నెస్‌తో ర‌చ్చ‌లేపే జ్యోతిరాయ్ తాజాగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 May 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Jyothi Rai : గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి ఆంటీలో హాట్‌నెస్సే కాదు, మంచి మ‌నసు ఉంది.. ఏం చేసిందంటే..!

Jyothi Rai : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో జ‌గ‌తి మేడ‌మ్ పాత్రలో కనిపించి సంద‌డి చేసింది జ్యోతిరాయ్. పేరుకు కన్నడ నటినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు చాలా ద‌గ్గ‌రైంది. సీరియ‌ల్‌లో చాలా ప‌ద్ద‌తిగా, సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించిన ఈమె సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న హాట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తుంటుంది. జ్యోతిరాయ్ పిక్స్ క్ష‌ణాల‌లోనే నెట్టింట వైర‌ల్ అవుతుంటాయి. అయితే త‌న హాట్‌నెస్‌తో ర‌చ్చ‌లేపే జ్యోతిరాయ్ తాజాగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సాయం చేసింది. తద్వారా తన లాగే తన మనసూ ఎంతో అందమైనదని మరోసారి నిరూపించుకుంది.

Jyothi Rai : మంచి మ‌న‌సుతో..

‘భీమ్లా నాయక్’ సినిమాలో పాట పాడి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు కిన్నెర మొగిల‌య్య‌. ఆయ‌న తాజా ఇంటర్వ్యూలో తన కష్టాల గురించి చెప్పుకున్నారు. ఆ ఇంటర్వ్యూ హోస్ట్ చేసిన యాంకర్ శివ మాధవ్.. మొగిలయ్య కష్టాలను డైరెక్టర్ సుకు పూర్వజ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి పెన్షన్ ఆగిపోవడంతో మొగిలయ్య పరిస్థితి దయనీయంగా మారిందన్న విషయం తెలుసుకుని సుకు పూర్వజ్-జ్యోతి పూర్వజ్ దంపతులు చలించిపోయారు. అక్షయ తృతీయ రోజున తన వంతుగా 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం తాను కూడా ఇబ్బందుల్లో ఉన్నానని, అయితే తన ఇబ్బందుల కంటే మొగిలయ్య కష్టాలే తనను కలిచివేశాయని జ్యోతి రాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.

Jyothi Rai గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి ఆంటీలో హాట్‌నెస్సే కాదు మంచి మ‌నసు ఉంది ఏం చేసిందంటే

Jyothi Rai : గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి ఆంటీలో హాట్‌నెస్సే కాదు, మంచి మ‌నసు ఉంది.. ఏం చేసిందంటే..!

మొగిలయ్య ప్రతిభకు తాను చేస్తున్న డబ్బు సాయం పెద్దది కాదని, ఆయనకు సాయం చేసేందుకు మరికొందరు ముందుకు రావాలంటూ ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా మొగిలయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది..ఇక డైరెక్టర్ సుకు పూర్వజ్ కూడా మొగిలయ్య ప్రతిభకు దాసోహం అయ్యారు. తను దర్శకత్వం వహించబోయే సినిమాల్లో మొగిలయ్యను భాగస్వామి చేసి ఆయనకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మొగిలయ్యకు ఏదైనా పాత్ర ఇవ్వడం లేదా ఆయనతో పాటలు రాయించడం, పాడించడం చేస్తానని చెప్పారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది