Kiraak RP : జబర్దస్త్ తో తన బుల్లి తెర ప్రయాణం మొదలు పెట్టిన కిర్రాక్ ఆర్పీ ఇటీవల నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరు తో తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరు కు చెందిన ఆర్పీ తన సొంత ప్రాంతం నుండి నెల్లూరు ప్రత్యేకమైన చేపల పులుసు వంటకాన్ని హైదరాబాద్ జనాలకు రుచి చూపించాడు. హైదరాబాద్ లో అంతకు ముందే నెల్లూరు చేపల పులుసు కు సంబంధించి రెసిపీలు చాలా చాలా ఉన్నాయి, అయినా కూడా జనాలు ఆర్పీ చేపల పులుసు కోసం రోడ్డున పడ్డారు.
మొత్తానికి చేపల పులుసు రుచి ఏమో కానీ పబ్లిసిటీ మాత్రం విపరీతంగా చేశాడు, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ తో పాటు కాస్త పెద్ద చానల్స్ అన్నింటిలో కూడా ఆర్పీ కనిపించాడు. ఆహా ఓహో అంటూ పబ్లిసిటీ ఊదర గొట్టాడు. రోడ్ల పై జనాలను చూపించాడు.. కిచెన్ లో వంటకాలు చూపించాడు. రుచి ఉన్నా లేకున్నా జనాలు ఒక్కసారి ఆర్పీ చేపల పులుసు రుచి చూడాలని ఆశ పడేలా చేశాడు. పబ్లిసిటీ మాయాజాలంతో అద్భుతమైన తన చేపల పులుసు అంటూ ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచనను కల్పించాడు. అందుకే నెల్లూరు చేపల పులుసు అనగానే ఆర్పీ చేపల పులుసు
గుర్తుకు వచ్చేలా చేసాడు అనడంలో సందేహం లేదు. అంతటి గుర్తింపు తీసుకొచ్చిన నెల్లూరు చేపల పులుసు రుచి పర్వాలేదు అన్నట్లు ఉన్నా ఆర్పీ యొక్క ప్రచారం ఆ చేపల పులుసు గురించి మరింత పెంచింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షాప్ క్లోజ్ అయిన విషయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని పబ్లిసిటీ దక్కించుకున్నాడు. మొత్తానికి ఒక బిజినెస్ సక్సెస్ అవ్వడానికి పబ్లిసిటీ ఎంత ముఖ్యమో ఆర్పీ యొక్క నెల్లూరు చేపల పులుసు సక్సెస్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.