Veera Simha Reddy memes viral in social media
Veera Simha Reddy : అఖండ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేశారు. ఒంగోలు అర్జున్ ఇన్‌ఫ్రా గ్రౌండ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను లాంఛ్ చేశారు బీ గోపాల్. సీమలో ఏ ఒక్కడూ కత్తిపట్టకూడదని నేనొక్కడినే కత్తిపట్టా. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలునాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్ అంటూ గూస్ బంప్స్
తెప్పించే బాలయ్య మార్క్ డైలాగ్స్ తో షురూ అయింది ట్రైలర్. వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్ అంటూ రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో చెప్పే డైలాగ్స్ నందమూరి అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరికీ పూనకాలు తెప్పించాయి.. స్టార్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కన్నడ యాక్టర్ దునియా విజయ్ ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా విలన్ పాత్రలో కనిపించనున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా, . వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీలక పాత్రలు పోషించారు.
Veera Simha Reddy memes viral in social media
రాయలసీమలో కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుండగా, సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి గ్లింప్స్ వీడియో బాలకృష్ణ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఇక థమన్ స్వరపరచిన బాణీలు సంగీత ప్రియులకి మత్తెక్కిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వీర సింహారెడ్డి పాటలకు పరశించిపోతున్నారు. చిత్ర యూనిట్ వదిలిన హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో కూడిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది కాని, దానిపై నెట్టింట పలు మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. వాటిపై మీరు ఓ లుక్కేయండి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.