Kiraak RP : కిరాక్ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు మొత్తం పబ్లిసిటీ డ్రామానా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kiraak RP : కిరాక్ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు మొత్తం పబ్లిసిటీ డ్రామానా?

 Authored By prabhas | The Telugu News | Updated on :7 January 2023,4:20 pm

Kiraak RP : జబర్దస్త్ తో తన బుల్లి తెర ప్రయాణం మొదలు పెట్టిన కిర్రాక్ ఆర్పీ ఇటీవల నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరు తో తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరు కు చెందిన ఆర్పీ తన సొంత ప్రాంతం నుండి నెల్లూరు ప్రత్యేకమైన చేపల పులుసు వంటకాన్ని హైదరాబాద్ జనాలకు రుచి చూపించాడు. హైదరాబాద్‌ లో అంతకు ముందే నెల్లూరు చేపల పులుసు కు సంబంధించి రెసిపీలు చాలా చాలా ఉన్నాయి, అయినా కూడా జనాలు ఆర్పీ చేపల పులుసు కోసం రోడ్డున పడ్డారు.

మొత్తానికి చేపల పులుసు రుచి ఏమో కానీ పబ్లిసిటీ మాత్రం విపరీతంగా చేశాడు, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ తో పాటు కాస్త పెద్ద చానల్స్ అన్నింటిలో కూడా ఆర్పీ కనిపించాడు. ఆహా ఓహో అంటూ పబ్లిసిటీ ఊదర గొట్టాడు. రోడ్ల పై జనాలను చూపించాడు.. కిచెన్ లో వంటకాలు చూపించాడు. రుచి ఉన్నా లేకున్నా జనాలు ఒక్కసారి ఆర్పీ చేపల పులుసు రుచి చూడాలని ఆశ పడేలా చేశాడు. పబ్లిసిటీ మాయాజాలంతో అద్భుతమైన తన చేపల పులుసు అంటూ ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచనను కల్పించాడు. అందుకే నెల్లూరు చేపల పులుసు అనగానే ఆర్పీ చేపల పులుసు

kiraak RP nellore pedda reddy chepala pulusu success secret

kiraak RP nellore pedda reddy chepala pulusu success secret

గుర్తుకు వచ్చేలా చేసాడు అనడంలో సందేహం లేదు. అంతటి గుర్తింపు తీసుకొచ్చిన నెల్లూరు చేపల పులుసు రుచి పర్వాలేదు అన్నట్లు ఉన్నా ఆర్పీ యొక్క ప్రచారం ఆ చేపల పులుసు గురించి మరింత పెంచింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షాప్ క్లోజ్ అయిన విషయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని పబ్లిసిటీ దక్కించుకున్నాడు. మొత్తానికి ఒక బిజినెస్ సక్సెస్ అవ్వడానికి పబ్లిసిటీ ఎంత ముఖ్యమో ఆర్పీ యొక్క నెల్లూరు చేపల పులుసు సక్సెస్‌ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది