kiraak RP : అల్లు అర్జున్‌కి కిరాక్ ఆర్పీ వార్నింగ్స్.. ఇదంతా నాగ‌బాబునే చేయిస్తున్నాడా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

kiraak RP : అల్లు అర్జున్‌కి  కిరాక్  ఆర్పీ వార్నింగ్స్.. ఇదంతా నాగ‌బాబునే చేయిస్తున్నాడా..!

kiraak Rp : గ‌త కొద్ది రోజులుగా కిరాక్ ఆర్పీ తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. మెగా ఫ్యామిలీకి వ్య‌తిరేఖంగా మాట్లాడిన వారిపై ఫుల్ ఫైర్ అవుతున్నాడు. అల్లు అర్జున్.. వైసీపి నాయ‌కుడికి ప్ర‌చారం చేయ‌డంతో ఆయ‌న‌పై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. దీంతో జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీకి చెందిన హోటల్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ దాడి దిగారు. అదేంటి కిరాక్ ఆర్పీ టీడీపీ మద్ధతుదారుడు కదా , ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 June 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  kiraak RP  అల్లు అర్జున్‌కి  కిరాక్  ఆర్పీ వార్నింగ్స్.. ఇదంతా నాగ‌బాబునే చేయిస్తున్నాడా..!

kiraak Rp : గ‌త కొద్ది రోజులుగా కిరాక్ ఆర్పీ తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. మెగా ఫ్యామిలీకి వ్య‌తిరేఖంగా మాట్లాడిన వారిపై ఫుల్ ఫైర్ అవుతున్నాడు. అల్లు అర్జున్.. వైసీపి నాయ‌కుడికి ప్ర‌చారం చేయ‌డంతో ఆయ‌న‌పై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. దీంతో జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీకి చెందిన హోటల్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ దాడి దిగారు. అదేంటి కిరాక్ ఆర్పీ టీడీపీ మద్ధతుదారుడు కదా , ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం చేసిన వ్యక్తిపై బన్నీ ఫ్యాన్స్ దాడి చేయడం ఏంటి అనే అనుమానం రాకతప్పదు.ఇటీవల అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్ర కిషోర్ ఓడిపోయాడని.కానీ రాష్ట్రం కోసం పదేళ్లుగా కష్టపడుతున్న మావయ్య పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం నచ్చలేదని, దీని మెగా ఫ్యామిలీ స్పందించకపోయిన నేను స్పందిస్తానని తెలిపారు…

నాగ‌బాబు స‌పోర్ట్‌తోనా..

అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలపకపోవడం ముమ్మాటికి తప్పని ఈయన చెప్పడమే కాకుండా బన్నీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఒకనొక సమయంలో తన స్థాయిని మరిచి అల్లు అర్జున్‌పై కిర్రాక్ ఆర్పీ విమర్శలు చేయడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. కిర్రాక్ ఆర్పీకి సంబంధించిన రెస్టారెంట్‌పై అభిమానులు దాడికి పాల్పడ్డారు. ఆయన చేపల పులుసు రెస్టారెంట్ పై దాడులు చేశారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కిరాక్ ఆర్పీ.. బ‌న్నీకి వ్య‌తిరేఖంగా మాట్లాడుతూ.. . నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ. అయితే ఏంటీ? నేను ఎవడికీ భయపడను. నీ పతనం మొదలైందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

kiraak Rp strong warning to hero allu arjun

kiraak Rp strong warning to hero allu arjun

పోలింగ్ ముగిసిన సాయంత్రం నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్ ఇకపై మావాడు కాదని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వివాదం రేపగా డిలీట్ చేసిన నాగబాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక అప్ప‌టి నుండి నాగ‌బాబు సైలెంట్ అయిపోగా, వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడం నచ్చలేదని కిరాక్ ఆర్పీ అల్లు అర్జున్ పై విమర్శలు చేశాడు. నీకు ఆర్మీ ఉందో లేదో నాకు తెలియదు. ఆర్మీ అంటే నీది కాదు. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు నిజమైన ఆర్మీ. నువ్వు హీరోగా ఎదుగు సంతోషిస్తాము. అంతే కానీ ఇలాంటి చర్యలు మానుకో అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కిరాక్ ఆర్పీ ఇంతటి సాహసం చేయడం వెనుక నాగబాబు ఉన్నాడేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది