Kirrak RP : మ‌ళ్లీ అల్లు అర్జున్‌పై కిరాక్ ఆర్పీ విమ‌ర్శ‌లు.. ఎప్ప‌టికీ ఆయ‌న‌కి సారీ చెప్ప‌నంటూ ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kirrak RP : మ‌ళ్లీ అల్లు అర్జున్‌పై కిరాక్ ఆర్పీ విమ‌ర్శ‌లు.. ఎప్ప‌టికీ ఆయ‌న‌కి సారీ చెప్ప‌నంటూ ఫైర్

Kirrak RP : ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఇంకా చల్లారలేదు అనిపిస్తుంది. ఈ ఎన్నిల్లో ఎవరు ఊహించని విధంగా కూటమి విజయం సాధించ‌డంతో ప‌లు ప్రాంతాల‌లో అల్లర్లు, గొడ‌వ‌లు ఏ రేంజ్‌లో జ‌రిగాయో మ‌నం చూశాం. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేసారు. మ‌రోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీకి సంబంధించిన హోటల్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు పొందిన కిరాక్ ఆర్పీ కూటమికి మద్దతు ప్రకటించారు. కిరాక్ ఆర్పీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 July 2024,12:00 pm

Kirrak RP : ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఇంకా చల్లారలేదు అనిపిస్తుంది. ఈ ఎన్నిల్లో ఎవరు ఊహించని విధంగా కూటమి విజయం సాధించ‌డంతో ప‌లు ప్రాంతాల‌లో అల్లర్లు, గొడ‌వ‌లు ఏ రేంజ్‌లో జ‌రిగాయో మ‌నం చూశాం. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేసారు. మ‌రోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీకి సంబంధించిన హోటల్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు పొందిన కిరాక్ ఆర్పీ కూటమికి మద్దతు ప్రకటించారు. కిరాక్ ఆర్పీ అక్కడితో ఆగకుండా వైసీపీ నేతలపై ముఖ్యంగా కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాలలో కూటమి అధికారంలోకి రావడంతో ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ కూటమి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వైసీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేస్తున్నారు.

Kirrak RP నేను సారీ చెప్ప‌ను…

ప‌నిలో పనిగా అల్లు అర్జున్ ని కూడా విమ‌ర్శించారు. అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్ర కిషోర్ ఓడిపోయాడని.కానీ రాష్ట్రం కోసం పదేళ్లుగా కష్టపడుతున్న మావయ్య పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం నచ్చలేదని, దీని మెగా ఫ్యామిలీ స్పందించకపోయిన నేను స్పందిస్తానని తెలిపారు.అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలపకపోవడం ముమ్మాటికి తప్పని ఈయన చెప్పడమే కాకుండా బన్నీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ క్ర‌మంలో కిర్రాక్ ఆర్పీకి సంబంధించిన రెస్టారెంట్‌పై అభిమానులు దాడికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Kirrak RP మ‌ళ్లీ అల్లు అర్జున్‌పై కిరాక్ ఆర్పీ విమ‌ర్శ‌లు ఎప్ప‌టికీ ఆయ‌న‌కి సారీ చెప్ప‌నంటూ ఫైర్

Kirrak RP : మ‌ళ్లీ అల్లు అర్జున్‌పై కిరాక్ ఆర్పీ విమ‌ర్శ‌లు.. ఎప్ప‌టికీ ఆయ‌న‌కి సారీ చెప్ప‌నంటూ ఫైర్

ఇక తాజాగా కూడా అల్లు అర్జున్ విష‌యంలో కిర్రాక్ ఆర్పీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్‌ని కామెంట్ చేసిన నేప‌థ్యంలో మీకు సినిమా అవ‌కాశాలు రావ‌ని రిపోర్టర్ ప్ర‌శ్నించ‌గా, దానికి ఆర్పీ ఆసక్తిక‌ర కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ సినిమా కాక‌పోతే ఇంకో సినిమాలో న‌టిస్తాను. పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఎవ‌రు దేనిని అణ‌చివేయ‌రు. అప్పుడు అన్నాను, ఇప్పుడు నిల‌బ‌డ్డాను. ద‌మ్ముంటే రోజు ప్ర‌శ్నిస్తూ ఉండు. అదే విష‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాం. ఎప్పుడైన పోతాం. ప్ర‌శ్నించి పోదాం. ఈ రోజు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నాలాంటి వాళ్లే. ఎవ‌రికి ఎక్క‌డ వ్య‌త్యాసం లేదు. క్ష‌మాప‌ణ చెప్పే విధంగా నేను ఎప్పుడు చేయ‌ను అని ఆర్పీ పేర్కొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది