
Kirrak RP : మళ్లీ అల్లు అర్జున్‌పై కిరాక్ ఆర్పీ విమర్శలు.. ఎప్పటికీ ఆయనకి సారీ చెప్పనంటూ ఫైర్
Kirrak RP : ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఇంకా చల్లారలేదు అనిపిస్తుంది. ఈ ఎన్నిల్లో ఎవరు ఊహించని విధంగా కూటమి విజయం సాధించడంతో పలు ప్రాంతాలలో అల్లర్లు, గొడవలు ఏ రేంజ్‌లో జరిగాయో మనం చూశాం. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేసారు. మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీకి సంబంధించిన హోటల్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు పొందిన కిరాక్ ఆర్పీ కూటమికి మద్దతు ప్రకటించారు. కిరాక్ ఆర్పీ అక్కడితో ఆగకుండా వైసీపీ నేతలపై ముఖ్యంగా కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాలలో కూటమి అధికారంలోకి రావడంతో ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ కూటమి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వైసీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
పనిలో పనిగా అల్లు అర్జున్ ని కూడా విమర్శించారు. అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్ర కిషోర్ ఓడిపోయాడని.కానీ రాష్ట్రం కోసం పదేళ్లుగా కష్టపడుతున్న మావయ్య పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం నచ్చలేదని, దీని మెగా ఫ్యామిలీ స్పందించకపోయిన నేను స్పందిస్తానని తెలిపారు.అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలపకపోవడం ముమ్మాటికి తప్పని ఈయన చెప్పడమే కాకుండా బన్నీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ క్రమంలో కిర్రాక్ ఆర్పీకి సంబంధించిన రెస్టారెంట్‌పై అభిమానులు దాడికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Kirrak RP : మళ్లీ అల్లు అర్జున్‌పై కిరాక్ ఆర్పీ విమర్శలు.. ఎప్పటికీ ఆయనకి సారీ చెప్పనంటూ ఫైర్
ఇక తాజాగా కూడా అల్లు అర్జున్ విషయంలో కిర్రాక్ ఆర్పీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్‌ని కామెంట్ చేసిన నేపథ్యంలో మీకు సినిమా అవకాశాలు రావని రిపోర్టర్ ప్రశ్నించగా, దానికి ఆర్పీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ సినిమా కాకపోతే ఇంకో సినిమాలో నటిస్తాను. పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఎవరు దేనిని అణచివేయరు. అప్పుడు అన్నాను, ఇప్పుడు నిలబడ్డాను. దమ్ముంటే రోజు ప్రశ్నిస్తూ ఉండు. అదే విషయానికి కట్టుబడి ఉంటాం. ఎప్పుడైన పోతాం. ప్రశ్నించి పోదాం. ఈ రోజు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నాలాంటి వాళ్లే. ఎవరికి ఎక్కడ వ్యత్యాసం లేదు. క్షమాపణ చెప్పే విధంగా నేను ఎప్పుడు చేయను అని ఆర్పీ పేర్కొన్నారు.
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
This website uses cookies.