Nandamuri Mokshagna : ఎట్టకేలకి సినీ ఎంట్రీపై స్పందించిన బాలయ్య తనయుడు.. వస్తున్నా అంటూ సోషల్ మీడియా పోస్ట్
Nandamuri Mokshagna : నందమూరి అభిమానులు ఎప్పటి నుండో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రేపు అంటూ తెగ ప్రచారాలు జరుగుతుండగా, ఎట్టకేలకి దీనిపై ఓ క్లారిటీ అయితే వచ్చినట్టైంది. నందమూరి అభిమానులకి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట బాలకృష్ణ. ఎప్పటినుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పైగా మోక్షజ్ఞకి ఇప్పటికే 29 ఏళ్లు వచ్చేశాయి. దీంతో వీలైనంత త్వరగా వారసుడ్ని లాంఛ్ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. తన కుమారుడిని ఈ ఏడాది టాలీవుడ్‌లోకి హీరోగా వదులుతున్నట్లు బాలయ్య పలు సందర్భాల్లో ప్రకటించారు.
అప్పటి నుంచి ఏ డైరెక్టర్‌తో మోక్షజ్ఞని లాంఛ్ చేస్తారా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెలిసింది. గతంలో కొంచెం బొద్దుగా ఉన్న అతను ఇప్పుడు ఎంతో నాజుకుగా, స్టైలిష్ గా మారిపోయాడు. ఇలా స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా ఉన్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన మోక్షజ్ఞ ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు.ప్రస్తుతం మోక్షజ్ఞ ఫొటోలు, ట్వీట్ నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. బాలయ్య కుమారుడి ఎంట్రీ ఖాయమైందంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ సినిమా అరంగేట్రం ఉంటుందని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు బాలయ్య. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తోంది.
Nandamuri Mokshagna : ఎట్టకేలకి సినీ ఎంట్రీపై స్పందించిన బాలయ్య తనయుడు.. వస్తున్నా అంటూ సోషల్ మీడియా పోస్ట్
తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ డెబ్యూ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తారని టాక్. ఈ ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రశాంత్ వర్మ. అలాంటి యంగ్ డైరెక్టర్ చేతుల మీదుగా మోక్షజ్ఞను లాంఛ్ చేస్తే బావుంటుందని బాలయ్య అనుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు బోయపాటితో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే టాక్ నడిచింది.. అధికారికంగా ఈ విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక మోక్షజ్ఞ సినిమాలని నిర్మించేందుకు వారిద్దరి సోదరీమణులు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.