Hero Simbhu : స్టార్ హీరో పెళ్ళాన్ని కోరుకున్న తమిళ హీరో సింభు.. ఆఖర్లో ఊహించని ట్విస్ట్ !
Hero Simbhu : శింబు తెలుసు కదా. కోలీవుడ్ లో స్టార్ హీరో. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. శింబు నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలోనూ శింబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే.. శింబు ఎప్పుడూ పలు విషయాల్లో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తమిళనాడులో స్టార్ హీరోగా చాలా ఏళ్ల పాటు వెలుగొందిన శింబుకు ఈ మధ్య సినిమాలు అంతగా అచ్చి రావడం […]

Hero Simbhu : శింబు తెలుసు కదా. కోలీవుడ్ లో స్టార్ హీరో. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. శింబు నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలోనూ శింబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే.. శింబు ఎప్పుడూ పలు విషయాల్లో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తమిళనాడులో స్టార్ హీరోగా చాలా ఏళ్ల పాటు వెలుగొందిన శింబుకు ఈ మధ్య సినిమాలు అంతగా అచ్చి రావడం లేదు. అప్పట్లో నయనతారతోనూ డేటింగ్ చేసి చివరకు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది.
ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. అయితే.. తను ఏ హీరోయిన్ తో సినిమాలో నటిస్తే ఆ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉండేవాడు అంటూ అప్పట్లో తెగ వార్తలు వచ్చేవి. నయనతార తర్వాత హన్సికతోనూ శింబు కొన్నేళ్ల పాటు సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇక.. తన తదుపరి సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ ను ఏరికోరి మరీ శింబు సెలెక్ట్ చేసుకున్నాడట. ఆ స్టార్ హీరోయిన్ కూడా టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన హీరోయిన్ కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. అంతే కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో భార్య.
Hero Simbhu : దీపికా పదుకొణెను తన తదుపరి సినిమాలో తీసుకున్న శింబు
ప్రస్తుతం దీపికా పదుకొణెకు ఎంత డిమాండ్ ఉందో తెలుసు కదా. తను ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఇటీవల పఠాన్ సినిమా సూపర్ సక్సెస్ తో దీపికా చాలా బిజీ అయిపోయింది. పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది దీపికా. ప్రభాస్ తో ఓ సినిమాలో నటిస్తున్న దీపికా.. శింబులాంటి హీరోతో సినిమా చేయడానికి ఒప్పుకుంటుందా? ఏది ఏమైనా… దీపికనే తన మూవీలో హీరోయిన్ గా పెట్టాలని మూవీ యూనిట్ కు కండిషన్ పెట్టాడట శింబు. ఎంత పారితోషికం అయినా ఇవ్వడానికి మేకర్స్ కూడా రెడీ అయ్యారట కానీ.. శింబు పక్కన నటించడానికి దీపికా పదుకొణె ఒప్పుకోవాలి కదా. చూద్దాం మరి ఏం జరుగుతుందో.