Samantha : అక్కినేని నాగచైతన్య, సమంత ఇటీవల విడిపోయిన సంగతి అందరికీ విదితమే. కాగా, నాగచైతన్య నుంచి విడిపోయిన నేపథ్యంలో కొందరు సమంతపై నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో సమంత వాటికి రిప్లయి కూడా ఇచ్చింది. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించే ఎవరికీ లేదని పేర్కొంది. కాగా, తన పరువుకు నష్టం కలిగించే విధంగా పలు యూట్యూబ్ చానల్స్ ప్రచారం చేశాయంటూ వాటిపై పరువు నష్టం దావా వేసింది సమంత. కాగా, విచారణలో సమంతకు కోర్టు నుంచి చిన్నపాటి షాక్ తగిలింది.నాగచైతన్యతో విడాకులు తీసుకున్నందుకుగాను రెండు యూట్యూబ్ చానల్స్, డాక్టర్ వెంకట్‌రావు తనపై తప్పుడు ప్రచారం చేశారని, అలా ప్రచారం చేయడం వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిత్వానికి భంగం కలిగిందని పేర్కొంటూ సమంత తరఫున లాయర్ కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించాడు.
సమంతపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ చానల్స్, సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు అయింది. ఆ పిటిషన్‌ను గురువారం న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో లాయర్ బాలాజీ సమంత తరఫున వాదనలు వినిపించారు. హీరోయిన్‌గా సమంత చాలా బిజీగా ఉంటారని, ఈ నేపథ్యంలో పిటిషన్‌ను అత్యవసరంగా విచారించి తగుచర్యలు తీసుకోవాలని కోరాడు లాయర్. లాయర్ వాదనలు విన్న న్యాయస్థానం కేసును అలా ఎమర్జెన్సీ ప్రాతపదికన విచారించడం కుదరబోదని పేర్కొంది. లాయర్ బాలాజీపై న్యాయస్థానం ఫైర్ అయింది కూడా. అత్యవసర విచారణ సాధ్యం కాదని, కోర్టు, చట్టం మందు అందరూ సమానులేనని, కొందరు ఎక్కువ, మరికొందరు తక్కువ అనే భావన ఉండదని చెప్పింది.
సమంత పరువు నష్టం దావా పిటిషన్‌ను అన్ని పిటిషన్‌ల మాదిరిగానే విచారిస్తామని, అత్యవసర కేసుగా తీసుకోబోమని జడ్జి తెలిపారు. ఈ సంగతులు ఇలా ఉంచితే సమంత ప్రొఫెషనల్ కెరీర్ దూసుకుపోతున్నదని చెప్పొచ్చు. పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’, ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్ర షూటింగ్స్ పూర్తి చేసిన సమంత.. ప్రజెంట్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో హిందీ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం.
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
This website uses cookies.