Home » Entertainment » Asalem Jarigindi Will Be Released In Theatres
Entertainment

Asalem Jarigindi : హీరో శ్రీరామ్‌కు ‘అసలేం జరిగింది?’.. అప్పుడే తెలుస్తుంది..

Authored By
mallesh
The Telugu News | Updated on: October 21, 2021, 8:33 pm
Advertisement

Asalem Jarigindi : ‘ఒకరికి ఒకరు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ హీరో శ్రీరామ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే, శ్రీరామ్‌కు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ పాపులారిటీ బాగానే ఉంది. తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తూనే తమిళ్ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు శ్రీరామ్. కాగా, చాలా రోజుల తర్వాత శ్రీరామ్ హీరోగా నటించిన చిత్రం తెలుగులో విడుదల కాబోతున్నది.న్యూ కాన్సెప్ట్‌తో కమర్షియల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ సరసన హీరోయిన్‌గా సంచితా పదుకునే నటించింది. ఎన్వీఆర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ ప్రొడ్యూస్ చేశారు.

Advertisement

asalem jarigindi will be released in theatres

ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్.. తాజాగా థియేట్రికల్ రిలీజ్‌కే ఓకే చెప్పారు. ఈ నెల 22న ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, అండమాన్ నికోబార్, ఒడిస్సాలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా నూతన కాన్సెప్టుతో ‘అసలేం జరిగింది?’ చిత్రం రూపొందినట్లు ప్రొడ్యూసర్స్ తెలిపారు. హారర్ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ అయినప్పటికీ లవ్ స్టోరి‌గా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని, ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీ సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు చెప్పారు. ఇక ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యం కాగా, అందుకోసం మేకర్స్ కేర్ తీసుకున్నారు.

Advertisement

Asalem Jarigindi : వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్..

Asalem-Jarigindi

ఎస్. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారని తెలుస్తోంది. ప్రేక్షకులకు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉత్కంఠకు గురి చేస్తాయని అంటున్నారు. ఈ సినిమాకు యేలేంద్ర మహావీర్ సంగీతం అందించగా, సినిమాకు మ్యూజిక్ చాలా అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, మూవీపై అంచనాలను ఇంకా పెంచేసింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి