Koratala Siva : ‘ఆచార్య’ ఎఫెక్ట్..సక్సెస్ ఫార్ములానే వదిలేశారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Koratala Siva : ‘ఆచార్య’ ఎఫెక్ట్..సక్సెస్ ఫార్ములానే వదిలేశారా..?

Koratala Siva : వరుస విజయాలలో ఉన్న దర్శకుడు కొరటాల శివ మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా చేసి మొదటిసారి కెరీర్‌లో ఫ్లాప్ అందుకున్నారు. కొరటాల మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేసినా అందులో మెగా హీరోలు చేసిన పలు మార్పులు వల్ల కథ, కథనం మారిపోయి కథలో పస లేకుండా పోయింది. ఇద్దరు మెగా హీరోలు స్క్రీన్ మీద కనిపించినా కూడా కనీసం మెగా అభిమానులను కూడా మెప్పించలేకపోయింది ఆచార్య చిత్రం. మణిశర్మ సంగీతం రెజీనా, […]

 Authored By govind | The Telugu News | Updated on :19 May 2022,5:00 pm

Koratala Siva : వరుస విజయాలలో ఉన్న దర్శకుడు కొరటాల శివ మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా చేసి మొదటిసారి కెరీర్‌లో ఫ్లాప్ అందుకున్నారు. కొరటాల మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేసినా అందులో మెగా హీరోలు చేసిన పలు మార్పులు వల్ల కథ, కథనం మారిపోయి కథలో పస లేకుండా పోయింది. ఇద్దరు మెగా హీరోలు స్క్రీన్ మీద కనిపించినా కూడా కనీసం మెగా అభిమానులను కూడా మెప్పించలేకపోయింది ఆచార్య చిత్రం. మణిశర్మ సంగీతం రెజీనా, సంగీతల స్పెషల్ సాంగ్స్ అన్నీ ఉన్నా కలిసి రాలేదు. నిజంగా మెగా ఫ్యామిలీ హీరోలకు ఇది షాక్ అని చెప్పక తప్పదు.

నిర్మాత – డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయినా కూడా దాన్ని మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అలాగే, దర్శకుడు కొరటాల శివ తమ రెమ్యునరేషన్‌లో చాలావరకు తిరిగి ఇచ్చేశారు. ఎంతో కొంత నిర్మాత, డిస్ట్రిబ్యూట్స్‌ను ఆదుకున్నారు. అది కాదు సమస్య..భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య మెగా హీరోల ఖాతాలో హిట్‌గా చేరలేకపోయింది. దాంతో దర్శకుడు కొరటాల శివ ఏకంగా తన సక్సెస్ ఫార్ములా అయినా మేసేజ్ ఓరియెంటెడ్ జోనర్‌ను వదిలేయనున్నట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది. అందుకే, కొరటాల యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయబోతున్న సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాలని చూస్తున్నారట.

Koratala Siva Acharya Effect Success Formula

Koratala Siva Acharya Effect Success Formula

Koratala Siva : కమర్షియల్ సినిమా అంటే అది ఎలా ఉంటుందో..!

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను..ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాలన్నిటిలోనూ కొరటాల ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారు. వీటిలో ఆచార్య తప్ప మిగతా నాలుగు సినిమాలు ఆ మేసేజ్ జనాలకు విపరీతంగా నచ్చి భారీ హిట్ అయ్యేందుకు కలిసొచ్చింది. అయినా ఆచార్య సినిమాను దృష్ఠిలో పెట్టుకొని ఈసారి ఎన్టీఆర్ 30వ సినిమాలో మెసేజ్ కంటే కూడా కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమా కొరటాల శివదే. కాబట్టి, పాన్ ఇండియా లెవల్‌లో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరి కొరటాల తన మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాకుండా కమర్షియల్ సినిమా అంటే అది ఎలా ఉంటుందో..జనాలకు ఎంతవరకు ఎక్కుతుందో చూడాలి.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది