Kota Srinivasa Rao : నటనకు పెట్టని కోట.. మన కోట శ్రీనివాసరావు. వైవిధ్యమైన పాత్రలు పోషించి అశేష ప్రేక్షకాదరణ పొందారు కోట. విలన్‌గా భయపెట్టడంలోనైనా..కామెడీతో కడుపుబ్బా నవ్వించడంలోనైనా..క్యారెక్టర్ ఆర్టిస్టుగా కన్నీళ్లు పెట్టించడంలోనైనా కోట స్టైలే వేరు. సినీ రంగంలో రాణించాలనుకునే అప్ కమింగ్ యాక్టర్లలో చాలా మంది కోటశ్రీనివాస రావును కూడా స్పూర్తిగా తీసుకుంటారు. వయస్సు మీద పడుతున్నా ఇప్పటికీ యాక్టింగ్ చేస్తూ..యువ నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే కోట శ్రీనివాస రావు అప్పుడపుడు కాంట్రవర్సియల్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారని తెలిసిందే.
తెలంగాణ మాండలీకం అంటే నాకు ప్రేమ అని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.సినిమాలకు ట్రైల్ అనేది నేను ఎప్పుడూ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.అప్పట్లో మరీ నల్లగా ఉండేవాడినని ఆయన తెలిపారు.ఆరోజుల్లో సినిమాలో ఛాన్స్ రాదని నేను అనుకునేవాడినని ప్రతిఘటన సినిమాకు ముందు జంధ్యాల గారికి నేను బాగా పరిచయమని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. మద్రాసు నుండి తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ కు తరలించాలని భావించినప్పుడు మద్రాస్ వాళ్ళు అక్కడికి వచ్చి పనిచేయమని చెప్పడంతో చాలా గొడవ జరిగిందని అన్నిచోట్ల కూడా పనిచేసుకొనే స్వేచ్ఛ ఉండాలి అంటూ 1994లో నాయుడు గారు కళా మండప నిరాహార దీక్షను ఐదు రోజులపాటు చేశానని కోట గుర్తు చేశారు.
నిజానికి అంత సీరియస్గా ఆ దీక్ష చేశాను కాబట్టి ఈరోజు తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కి వచ్చింది లేకపోతే అయ్యుండేది కాదని తెలిపారు ఈ విషయాన్ని ఎవరు చప్పరు కానీ నేను పట్టించుకోనని తెలిపారు.ప్రస్తుతం వితండ వాదన ఎక్కువైపోయిందని కోట శ్రీనివాసరావు అన్నారు.కుర్రాళ్లు ఒక సినిమా హిట్ అయితే గర్వం ప్రదర్శిస్తున్నారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.మనిషికి విజ్ఞానం పెరగాలని మనవాళ్లు విజ్ఞానం పెంచుకుంటూ జ్ఞానం పోగొట్టుకుంటున్నారని వెల్లడించారు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.