Kota Srinivasa Rao: నేను లేక‌పోతే తెలుగు ఇండ‌స్ట్రీ ఇక్క‌డ ఉండేది కాదంటూ కోట శ్రీనివాస‌రావు షాకింగ్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kota Srinivasa Rao: నేను లేక‌పోతే తెలుగు ఇండ‌స్ట్రీ ఇక్క‌డ ఉండేది కాదంటూ కోట శ్రీనివాస‌రావు షాకింగ్ కామెంట్స్

Kota Srinivasa Rao : న‌ట‌న‌కు పెట్ట‌ని కోట‌.. మ‌న కోట శ్రీనివాస‌రావు. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు కోట‌. విల‌న్‌గా భ‌య‌పెట్ట‌డంలోనైనా..కామెడీతో క‌డుపుబ్బా న‌వ్వించ‌డంలోనైనా..క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా క‌న్నీళ్లు పెట్టించ‌డంలోనైనా కోట స్టైలే వేరు. సినీ రంగంలో రాణించాల‌నుకునే అప్ క‌మింగ్ యాక్ట‌ర్ల‌లో చాలా మంది కోట‌శ్రీనివాస రావును కూడా స్పూర్తిగా తీసుకుంటారు. వ‌య‌స్సు మీద ప‌డుతున్నా ఇప్ప‌టికీ యాక్టింగ్ చేస్తూ..యువ న‌టీన‌టుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అయితే కోట శ్రీనివాస రావు అప్పుడపుడు కాంట్ర‌వ‌ర్సియ‌ల్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :12 August 2022,7:40 pm

Kota Srinivasa Rao : న‌ట‌న‌కు పెట్ట‌ని కోట‌.. మ‌న కోట శ్రీనివాస‌రావు. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు కోట‌. విల‌న్‌గా భ‌య‌పెట్ట‌డంలోనైనా..కామెడీతో క‌డుపుబ్బా న‌వ్వించ‌డంలోనైనా..క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా క‌న్నీళ్లు పెట్టించ‌డంలోనైనా కోట స్టైలే వేరు. సినీ రంగంలో రాణించాల‌నుకునే అప్ క‌మింగ్ యాక్ట‌ర్ల‌లో చాలా మంది కోట‌శ్రీనివాస రావును కూడా స్పూర్తిగా తీసుకుంటారు. వ‌య‌స్సు మీద ప‌డుతున్నా ఇప్ప‌టికీ యాక్టింగ్ చేస్తూ..యువ న‌టీన‌టుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అయితే కోట శ్రీనివాస రావు అప్పుడపుడు కాంట్ర‌వ‌ర్సియ‌ల్ కామెంట్స్ తో వార్త‌ల్లో నిలుస్తుంటార‌ని తెలిసిందే.

Kota Srinivasa Rao : అంతా నా వ‌ల్లే..

తెలంగాణ మాండలీకం అంటే నాకు ప్రేమ అని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.సినిమాలకు ట్రైల్ అనేది నేను ఎప్పుడూ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.అప్పట్లో మరీ నల్లగా ఉండేవాడినని ఆయన తెలిపారు.ఆరోజుల్లో సినిమాలో ఛాన్స్ రాదని నేను అనుకునేవాడినని ప్రతిఘటన సినిమాకు ముందు జంధ్యాల గారికి నేను బాగా పరిచయమని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. మద్రాసు నుండి తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ కు తరలించాలని భావించినప్పుడు మద్రాస్ వాళ్ళు అక్కడికి వచ్చి పనిచేయమని చెప్పడంతో చాలా గొడవ జరిగిందని అన్నిచోట్ల కూడా పనిచేసుకొనే స్వేచ్ఛ ఉండాలి అంటూ 1994లో నాయుడు గారు కళా మండప నిరాహార దీక్షను ఐదు రోజులపాటు చేశానని కోట గుర్తు చేశారు.

Kota Srinivasa Rao Comments On Telugu Industry

Kota Srinivasa Rao Comments On Telugu Industry

నిజానికి అంత సీరియస్గా ఆ దీక్ష చేశాను కాబట్టి ఈరోజు తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కి వచ్చింది లేకపోతే అయ్యుండేది కాదని తెలిపారు ఈ విషయాన్ని ఎవరు చప్పరు కానీ నేను పట్టించుకోనని తెలిపారు.ప్రస్తుతం వితండ వాదన ఎక్కువైపోయిందని కోట శ్రీనివాసరావు అన్నారు.కుర్రాళ్లు ఒక సినిమా హిట్ అయితే గర్వం ప్రదర్శిస్తున్నారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.మనిషికి విజ్ఞానం పెరగాలని మనవాళ్లు విజ్ఞానం పెంచుకుంటూ జ్ఞానం పోగొట్టుకుంటున్నారని వెల్లడించారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది